Begin typing your search above and press return to search.

బర్త్ డే వేడుకలకు దూరంగా ప్రభాస్.. కానీ..!

By:  Tupaki Desk   |   22 Oct 2022 9:30 AM GMT
బర్త్ డే వేడుకలకు దూరంగా ప్రభాస్.. కానీ..!
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రేపటి(అక్టోబర్ 23)తో 43వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. 'ఛత్రపతి'తో టాలీవుడ్ బాక్సాఫీసులను షేక్ చేసిన ప్రభాస్, 'బాహుబలి'తో మాత్రం ఇండియన్ రికార్డులను కొల్లగొట్టాడు. అప్పటివరకు అత్యధిక కలెక్షన్లు సాధించిన ఇండియన్ సినిమా రికార్డులను బ్రేక్ చేసి ప్యాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించాడు.

ఇండియా మొత్తం 'బాహుబలి'కి ముందు ఆ తర్వాత అన్నట్లుగా మారిపోయింది. 'బాహుబలి' ఇన్పిరేషన్ తో ఆ తర్వాత ఎన్నో సినిమాలు ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలయ్యాయి. వీటిలో ఒక్క 'కేజీఎఫ్' మాత్రమే ఆస్థాయిలో కలెక్షన్లు రాబట్టింది. 'బాహుబలి' తర్వాత ప్రభాస్ నటించిన 'సాహో' సైతం నార్త్ లో మంచి కలెక్షన్లు రాబట్టింది.

అయితే ఆ తర్వాత వచ్చిన 'రాధేశ్యామ్' అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు. ప్రస్తుతం ప్రభాస్ వరుసబెట్టి ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నారు. 'ఆదిపురుష్', 'సలార్', ప్రాజెక్ట్ కే' వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నాడు. వీటితోపాటు ప్రభాస్ గతంలో నటించిన 'బిల్లా' మూవీ రీ రిలీజు అవుతోంది.

కాగా ఇటీవల ప్రభాస్ పెద్దనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆకస్మికంగా మృతిచెందారు. దీంతో కొన్ని రోజులు ప్రభాస్ షూటింగులకు దూరంగా ఉన్నాడు. అంతేకాకుండా రేపటి పుట్టినరోజు వేడుకలకు సైతం ప్రభాస్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు.

మరోవైపు అభిమానులు నిరాశ చెందకుండా మూవీ మేకర్స్ మాత్రం ప్రభాస్ సినిమాలకు సంబంధించిన టీజర్స్, అప్డేట్స్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు.

ఈ మేరకు రేపు 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్టు కే' నుంచి కొత్త అప్డేట్స్ వచ్చే అవకాశం కన్పిస్తోంది. ఇదిలా ఉంటే ప్రభాస్ మారుతితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ రేపటి నుంచి మూడు రోజులపాటు టెస్ట్ షూట్ చేయనున్నారని సమాచారం.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.