Begin typing your search above and press return to search.
ప్రభాస్.. రియల్ లైఫ్ లోనూ బాహుబలే
By: Tupaki Desk | 13 March 2016 9:57 AM ISTబాహుబలి సినిమాలో ప్రభాస్ పాత్రకు అందరూ నీరాజనాలు పలకడానికి కారణం.. అన్ని స్థాయిల వాళ్లను కలుపుకుని వెళ్లడమే. తన సైన్యంతో సమానంగా తనూ ఉంటాననే రోల్ బాహుబలిలో చేశాడు యంగ్ రెబల్ స్టార్. కానీ ప్రభాస్ రియల్ లైఫ్ లోనూ ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాడే అనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.
ప్రభాస్ ఇంటిలో పని చేసే ఓ యువతి పెళ్లి జరిగింది. హైద్రాబాద్ చందానగర్ లో జరిగిన వివాహ వేడుకకు.. ప్రభాస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తమ యజమానే అయినా.. అంత పెద్ద హీరో తమ ఇంట జరిగే శుభకార్యానికి రావడం ఆ కుటుంబాన్ని ఆశ్చర్యానికి గురిచేసి ఆనందంలో ముంచెత్తింది. కేవలం ఇలా వచ్చి అలా వెళ్లిపోవడమే కాకుండా.. కాసేపు అక్కడే కూర్చుని చాలామందితో కబుర్లు కూడా చెప్పాడు రియల్ లైఫ్ బాహుబలి.
మ్యారేజ్ ఫంక్షన్ లో ఇలా ఒక్కసారిగా స్టార్ హీరో కనిపించడంతో.. అక్కడున్న వారందరూ ఆశ్చర్యపోయారు. ప్రభాస్ వచ్చాడని తెలిసి, చాలామంది ఆ పెళ్లి వేదిక దగ్గరకు వచ్చారు. కొంత మంది ఫ్యాన్స్ ప్రభాస్ ఫోటోను తీసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో ఈ విషయం జనాలకు తెలిసింది. స్థాయి - స్టేటస్ అనకుండా.. తమ ఇంట్లో పని చేసే యువతి పెళ్లికి కూడా ప్రభాస్ లాంటి హీరో అటెండ్ కావడంతో.. ఈ హీరోపై అందరికీ గౌరవం అపారంగా పెరిగిపోయింది.