Begin typing your search above and press return to search.

బిగ్‌ బి పారితోషికం చూస్తుంటే ప్రభాస్‌ వంద కోట్లు నిజమే అనిపిస్తుంది

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:15 AM IST
బిగ్‌ బి పారితోషికం చూస్తుంటే ప్రభాస్‌ వంద కోట్లు నిజమే అనిపిస్తుంది
X
ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్‌ ల కాంబో మూవీ గురించి ఎప్పుడూ ఏదో ఒక వార్త మీడియాలో వస్తూ సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తూనే ఉన్నాయి. దీపిక పదుకునేకు ఏకంగా రూ.20 కోట్ల పారితోషికం ఇవ్వబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు బిగ్‌ బి పారితోషికం హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఈ సినిమాలో అమితాబచ్చన్‌ కేవలం గెస్ట్‌ రోల్‌ కాదని మొదటి నుండి చెబుతూ వస్తున్న యూనిట్‌ సభ్యులు తాజాగా ఆయనకు రూ.21 కోట్లు ఇస్తున్నట్లుగా అనధికారికంగా చెబుతున్నారు. బాలీవుడ్‌ లో బిగ్‌ బి ప్రధాన పాత్రలో నటిస్తే ఈ స్థాయిలో పారితోషికాన్ని తీసుకుంటాడు. ఆ రేంజ్‌ లో ఈ సినిమా కోసం ఆయన తీసుకుంటున్నాడు అంటే సినిమాలో ఆయన పాత్ర ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు.

హీరోయిన్‌ దీపికకు రూ.20 కోట్లు, అమితాబ్‌ కు రూ.21 కోట్లు పారితోషికంగా వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు ప్రభాస్‌ కు ఎంత పారితోషికం ఇస్తు ఉన్నారు అంటూ చర్చ జరుగుతోంది. ఆమద్య ప్రభాస్‌ కు వంద కోట్ల వరకు పారితోషికంగా ముడుతుందనే పుకార్లు షికార్లు చేశాయి. వీరిద్దరి పారితోషికం చూస్తుంటే ప్రభాస్‌ వంద కోట్లు తీసుకోవడం అబద్దం అయ్యి ఉండదు అనిపిస్తుంది. బాహుబలి మరియు సాహో సినిమాలతో ప్రభాస్‌ క్రేజ్‌ అమాతం పెరిగింది. ఈ సమయంలో ఆయన రాధేశ్యామ్‌ మరియు ఆదిపురుష్‌ సినిమాలను కూడా చేస్తున్నాడు. ఆ సినిమాలు ఖచ్చితంగా రికార్డు బ్రేకింగ్‌ వసూళ్లు చేస్తాయనే నమ్మకం ఉంది. అందుకే నాగ్‌ అశ్విన్‌ సినిమాకు ప్రభాస్‌ కు అశ్వినీదత్‌ వంద కోట్లు ఇచ్చినా కూడా ఆశ్చర్యం లేదు అనిపిస్తుంది. వచ్చే ఏడాది సమ్మర్‌ లో ఈ సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది.