Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా కాదు.. పాన్ వరల్డ్ మూవీ అట
By: Tupaki Desk | 18 July 2020 10:03 AM ISTబాహుబలి ఫ్రాంఛైజీ సినిమాల రాకతో తెలుగు సినిమా స్థాయి అమాంతం పదింతలైంది. కేవలం తెలుగు సినీపరిశ్రమలోనే కాదు ఇటు సౌత్ అంతటా పాన్ ఇండియా సినిమాల వెల్లువ అసాధారణ స్థాయికి చేరుకుంది. భారీగా ఫైనాన్సులు తెచ్చి నిజాయితీగా అలాంటి ప్రయత్నాలు చేసేవారు కొందరైతే.. అసలేదీ లేకుండానే సుందర్.సి (ఒక సినిమా మధ్యలోనే ఆగిందిగా) లాగా హడావుడి చేసేవాళ్లు లేకపోలేదు.
అదంతా సరే కానీ.. ఇప్పుడు పాన్ ఇండియా అన్నది పాత మాట. కొత్తగా `పాన్ వరల్డ్ మూవీ` అన్నది బాగా పాపులరవుతోంది. ముఖ్యంగా ప్రభాస్ నటించబోయే తదుపరి చిత్రం పాన్ ఇండియా మూవీ కాదట. పాన్ వరల్డ్ మూవీ అని చెబుతున్నారు. అది కూడా పాన్ వరల్డ్ అన్న మాట ఆ సినిమాకి పని చేస్తున్న ప్రముఖ రచయిత బుర్రా సాయిమాధవ్ అనడంతో ఒకటే అంచనాలు రెట్టించాయి.
ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న 20వ సినిమా రాధే శ్యామ్ చిత్రీకరణ పూర్తవుతోంది. ఈ మూవీ పూర్తవ్వగానే నాగ్ అశ్విన్ తో కెరీర్ 21వ సినిమాని మొదలెట్టేందుకు ప్రభాస్ సిద్ధమవుతున్నారు. ఆ క్రమంలోనే ఈ సినిమాకి రచయితగా పని చేస్తున్న బుర్రా సాయిమాధవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాహుబలి స్టార్ ప్రభాస్ నటించే తదుపరి చిత్రం కేవలం భారతీయ చలనచిత్రం కాదని.. పాన్-వరల్డ్ మూవీ అని అన్నారు.
పాన్ -వరల్డ్ అన్న పదమే ఎంతో బరువుగా ఎంతో అబ్బురంగా ఉంది. అయితే అంత బరువు మోయాలంటే బడ్జెట్లను కూడా ఆ రేంజులోనే పెట్టాల్సి ఉంటుంది. బడ్జెట్ పెడుతున్నారు అంటే కథ కంటెంట్ కూడా అంతకుమించి వర్కవుట్ చేయాలి. సినిమా పూర్తవ్వకముందే పాన్ వరల్డ్ రేంజులో బిజినెస్ కూడా పూర్తి చేయాల్సి ఉంటుంది. హాలీవుడ్ నుంచి టాప్ టెక్నీషియన్లను దించాలి. అందుకే మరీ అంతగా ఆకాశానికెత్తేసినా ఆ తర్వాత రకరకాల సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పైగా భారీ చిత్రాలతో పరాజయాలు ఎదుర్కొన్న వైజయంతీ మూవీస్ అధినేత అశ్వనిదత్ కి ఇదో సవాల్ గానూ మారుతుందనడంలో సందేహమేం లేదు. మరి బుర్రా సాయి మాధవ్ అన్న మాటను నిలబెట్టే రేంజులో నాగ్ అశ్విన్ వర్కవుట్ చేస్తారా? అన్నదే ఇప్పుడు ఆసక్తికరం.