Begin typing your search above and press return to search.
బాహుబలి ఫస్ట్‌టాక్; మతి పోగొట్టే వాళ్లిద్దరి అందం
By: Tupaki Desk | 10 July 2015 8:51 AM ISTభారీ అంచనాల మధ్య విడుదలైన బాహుబలి సినిమా ఫస్ట్‌హాఫ్‌లో ప్రత్యేకంగా ఓ రెండు అంశాలు చెప్పాల్సి వస్తే.. మొదటి స్థానంలో గ్రాఫిక్స్ నిలిస్తే.. రెండో స్థానంలో ప్రభాస్ మ్యాన్లీనెస్.. తమన్నా అందం గురించి చెప్పాల్సిందే. వాస్తవానికి.. గ్రాఫిక్స్.. ప్రభాస్.. తమన్నా అందం రెండు ఒకటికొకటి పోటీ పడుతుంటాయి.
సినిమా మొదటి హాఫ్‌లో ప్రభాస్ మ్యాన్లీగా కనిపించటమేకాదు.. సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టేశాడు. అతగాడి అందం ముందు అబ్బాయిలు సైతం ఫ్లాట్ అయిపోయేంత బాగా ఉన్నాడు.
ఇక.. ప్రభాస్‌తో పోటీ పడుతున్నట్లుగా మిల్కీబ్యూటీ తమన్నా ఇరగొట్టేసింది. ఆమె అందం వెండితెరకు కొత్త అందాన్ని తీసుకొచ్చింది. తమన్నా సీన్లు చూసినప్పుడు ఆమెను కళ్లారప్పకుండా చూడటం ఖాయం. అంత అందంగా రాజమౌళి తమన్నాను చూపించారని చెప్పక తప్పదు. విశ్రాంతి సమయానికి థియేటర్‌లో నుంచి బయటకు వచ్చినప్పుడు కళ్ల ముందు తేలేవి గ్రాఫిక్స్ అయితే.. ప్రభాస్.. తమన్నాల అందమే అని చెప్పక తప్పదు.
వెండితెరపై ప్రభాస్ కానీ తమన్నా కానీ తమను తాము చూసుకుంటే.. తాము ఇంత అందంగా ఉంటామా? వారికే సందేహం కలిగేలా ఉన్నారు. ఇప్పటివరకూ రాజమౌళికి.. తన హీరోయిన్లను చాలా అందంగా ప్రజెంట్ చేస్తారన్న పేరుంది. బాహుబలితో హీరోయిన్‌ను మాత్రమే కాదు.. హీరోను కూడా ఎంత అందంగా చూపించగలడన్నది అర్థమవుతోంది.