Begin typing your search above and press return to search.
ప్రభాస్, పవన్ ఫ్యాన్స్.. పూనకాలు తెప్పించారుగా..
By: Tupaki Desk | 3 Feb 2023 6:40 PM ISTఆహా టీమ్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న మళ్లీ అదే జరిగింది. సర్వర్స్ క్రాష్ అయ్యాయట. ఫిబ్రవరి 2న పవర్స్టార్ పవన్ కల్యాణ్ అన్స్టాపబుల్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయిన సంగతి తెలిసిందే. అయితే దీని కోసం ఎప్పటి నుంచో ఆసక్తిగా చూస్తున్నారు అభిమానులు. మరోవైపు పైరసీ రాయుళ్లు కూడా కాచుకుని కూర్చున్నారు. దీంతో ఆ ఎపిసోడ్ ఆహాలోకి అందుబాటులోకి రావడమే ఆలస్యం... ఒక్కసారిగా ఫ్యాన్స్, పైరసీ రాయుళ్లు ఆహాలోకి ఎంట్రీ రాయుళ్లు. దీంతో ఆహాకు సంబంధించిన పది సర్వర్లు క్రాష్ అయినట్లు తెలిసింది.
ఎంతో బందోబస్తుగా.. నిజానికి ఆహా ఈ సమస్యను మొదటగా ప్రభాస్ ఎపిస్టోడ్ స్ట్రీమింగ్ సమయంలో ఎదుర్కొంది. ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ మొదలైనప్పుడు ప్రభాస్ అభిమానుల తాకిడికి ఆహా యాప్ కొన్ని గంటల పాటు క్రాష్ అయింది. సర్వర్లు డౌన్ కావడంతో సేవలు నిలిచిపోయాయి. దీంతో అభిమానులు నిరాశ కూడా చెందారు. అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఈ సారి పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయింది. ఇక పవన్ కల్యాణ్ ఫ్యాన్ ఫోలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన ఎపిసోడ్ కోసం తెలుగు రష్ట్రాల ఫ్యాన్స్ ఎగపడి మరీ చూస్తారన్న సంగతి తెలిసిందే. దీంతో ఆహా టీమ్‌ను సర్వర్ క్రాష్ భయం మరోసారి వెంటాడింది. దీంతో ముందు జాగ్రత్తగా.. మళ్లీ క్రాష్ సమస్య తలెత్తకుండా ప్రత్యక జాగ్రత్తలు తీసుకుంది.
కానీ బ్యాకప్ సర్వర్స్‌ను కూడా ఇన్‌స్టాల్ చేసినట్లు సమాచారం. అలాగే పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ ప్రారంభమైన తర్వాత ప్లాట్‌ఫామ్ స్థిరత్వాన్ని పర్యవేక్షించేందుకు ఫోకస్ టీమ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిసింది. కానీ ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ముందు పనిచేయలేదు. మళ్లీ అభిమానుల తాకిడికి సర్వర్లు క్రాష్ అయ్యాయని తెలిసింది. కానీ అంతకముందుతో పోలిస్తే జాగ్రత్త చర్యలు తీసుకోవడం వల్ల ఈ సారి అంతగా ప్రభావం చూపలేదు.
ఇకపోతే పవన్ ఎపిసోడ్ స్ట్రీమింగ్ అవ్వకముందు ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ సోషల్మీడియాలో రచ్చ కూడా చేశారు. మళ్లీ 'ఆహా' క్రాష్ అవుతుందా? లేదా? అనే చర్చ కూడా సోషల్ మీడియాలో సాగింది. ఒక విధంగా అభిమానుల మధ్య పోటీ వాతావరణానికి కారణమైంది. ఫ్యాన్ ఫాలోయింగ్‌కు యాప్ క్రాష్ కావడం.. హీరో ఫ్యాన్ ఫాలోయింగ్కు కొలమానంగా మారింది. ఆహా మరోసారి క్రాష్ అయితే ప్రభాస్ కన్నా పవన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని, లేదంటే కాదని కొందరు ట్వీట్లు, పోస్టులు కూడా చేశారు. కానీ ఫైనల్గా పవన్ ఎపిసోడ్కు కూడా క్రాష్ అయినట్లు తెలిసింది.
మరోవైపు ఇంకొంతమంది అత్యుత్సాహం ప్రదర్శించి ఈ రచ్చలోకి సూపర్ స్టార్ మహేశ్బాబును లాగారు. తొలి సీజన్లో ఆయన ఎపిసోడ్ స్ట్రీమింగ్ అయినప్పుడు అస్సలు సర్వర్లు క్రాషే కాలేదని, అంత సాఫీగా సాగిందని అనడం ప్రారంభించారు. దీంతో మహేశ్ అభిమానుల సంఖ్య తక్కువ అని కూడా అన్నారు. మొత్తంగా మహేశ్ కన్నా ప్రభాస్, పవన్కే అభిమానులు ఎక్కువగా ఉన్నారంటూ ప్రచారం చేశారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.