Begin typing your search above and press return to search.

మెగాస్టార్ - యంగ్ రెబల్ స్టార్ పండగ సీజన్ లో వచ్చేది కష్టమేనట...!

By:  Tupaki Desk   |   24 May 2020 1:30 AM GMT
మెగాస్టార్ - యంగ్ రెబల్ స్టార్ పండగ సీజన్ లో వచ్చేది కష్టమేనట...!
X
ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల వలన అందరి ప్లానింగ్స్ మారుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే దర్శక నిర్మాతలు తమ సినిమాలను ఫలానా సీజన్లో ఫలానా డేట్ కి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు అవన్నీ తారుమారు అయ్యాయి. దీంతో ఏ సినిమా ఎప్పుడు రెడీ అవుతుందో.. ఏ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో.. ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో అన్నది తెలియకుండా అయిపోయింది. మాములుగా పండగ సీజన్ లో తమ సినిమాలని రిలీజ్ చేసుకోవాలని ప్రతీ హీరో దర్శక నిర్మాత కోరుకుంటారు. ఎందుకంటే పండగకి అయితే సినిమా కలెక్షన్స్ ఓ రేంజ్ లో రాబట్టే అవకాశం ఉంటుంది. సినిమా కొంచెం అటు ఇటుగా ఉన్నా వసూళ్ల పరంగా మంచి సినిమాగా నిలుస్తుంది. దీని కోసం దర్శక నిర్మాతలు పోటీపడి మరీ సినిమాలను ఫెస్టివల్ కి వచ్చేలా ప్లాన్ చేస్తారు. ముఖ్యంగా సంక్రాంతి పండగ అంటే సినిమా పండుగ అని చెప్పొచ్చు. కొత్త సినిమాలతో థియేటర్స్ అన్నీ కళ కళలాడుతుంటాయి. ప్రతి ఏడాది ఓ అరజడను సినిమాలు థియేటర్స్‌ లో సందడి చేస్తుంటాయి. ఈ ఏడాది కూడా రిలీజైన నాలుగు సినిమాలలో మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. దీంతో నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి తీవ్రమైన పోటీ ఏర్పడింది.

ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి కానుకగా జనవరి 8న వస్తామని ప్రకటించింది. కానీ ఇంకా 30 శాతం షూటింగ్ మిగిలి ఉండటం.. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్.. గ్రాఫిక్ వర్క్స్.. ఇలా చాలా పెండింగ్ వర్క్స్ ఉండటంతో ఈ సినిమా అనుకున్న సమయానికి వచ్చేలా కనిపించడం లేదు. దీంతో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న 'ఆచార్య' మరియు ప్రభాస్ - రాధాకృష్ణ సినిమాలు సంక్రాంతి బరిలో నిలవనున్నాయని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి రావడం కష్టమే అని టాక్ వినిపిస్తోంది. కారణం చిరంజీవి 'ఆచార్య' ఇంకా చాలా భాగం షూటింగ్ మిగిలి ఉంది. ఇది కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకోడానికి చాలానే టైం పట్టొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో రామ్ చరణ్ నటించనున్నాడు. చరణ్ ఈ సినిమా షూటింగ్ లో పాల్గొనాలంటే 'ఆర్.ఆర్.ఆర్' సినిమా కంప్లీట్ చేసి రావాలి. కానీ అది ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడం లేదు. దీంతో 'ఆచార్య' సంక్రాంతికి వస్తుందో లేదో అనే సందేహం రాకమానదు.

ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా విషయానికొస్తే ఈ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తయిందని సమాచారం. అయితే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ పనులు ఎక్కువ వున్నాయనట. దీనికోసం ఎక్కువ సమయం తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ సినిమా కూడా సంక్రాంతి బరిలో నిలుస్తుందో లేదో చెప్పలేం. దీంతో సంక్రాంతికి సమ్మర్ సీజన్లో వాయిదా పడిన సినిమాలు వచ్చే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. వాటిలో క్రేజీ మూవీ 'వకీల్ సాబ్' ముందు వరుసలో ఉంటుంది. దీంతో పాటు నితిన్ 'రంగ్ దే' కూడా సంక్రాంతి బరిలోకి దిగే అవకాశం వుంది. వీటితో పాటు కొన్ని చిన్న మీడియం రేంజ్ మూవీస్ ఈసారి పండక్కి వచ్చే ఛాన్స్ ఉందని చెప్పవచ్చు.