Begin typing your search above and press return to search.

'ప్రభాస్-అమిర్ ఖాన్'లతో పాన్ ఇండియా మూవీ..!

By:  Tupaki Desk   |   1 May 2020 2:40 PM IST
ప్రభాస్-అమిర్ ఖాన్లతో పాన్ ఇండియా మూవీ..!
X
టాలీవుడ్‌ లో మల్టీస్టారర్‌ ల క్రేజ్‌ రోజురోజుకి పెరిగిపోతుంది. ప్రేక్షకులు కూడా మల్టీస్టారర్‌ చిత్రాలను ఆదరించడం ఎప్పుడో మొదలు పెట్టారు. ఇక ఎలాగో అభిమానులు ఆదరిస్తున్నారు కదా అని స్టార్ హీరోలు సైతం ఇంటరెస్ట్ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో దర్శకనిర్మాతలు మల్టీస్టారర్ సినిమాలు రూపొందించడానికి ముందుకు వస్తున్నారు. ఇలాంటి టైంలో ఓ యంగ్ డైరెక్టర్ బన్నీ-ఎన్టీఆర్‌ లతో మల్టీ స్టారర్ తీయాలనుందని తన కోరికను బయట పెట్టాడు. లాస్ట్ ఇయర్ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ చిత్రం ద్వారా టాలీవుడ్‌ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్జేఎస్. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూ లో తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ల గురించి చెప్పుకొచ్చాడు స్వరూప్.

"మల్టీస్టారర్ చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. బన్నీ-ఎన్టీఆర్‌ లతో జాన్ విక్‌ స్టైల్‌ లాంటి యాక్షన్ ఎంటర్‌ టైనర్‌ ను తీయాలని ఉంది. అలాగే ఆమిర్ ఖాన్- ప్రభాస్‌ తో ఓ పాన్ ఇండియా మల్టీస్టారర్‌ ను తెరకెక్కించాలని ఉంది అది నా డ్రీం ప్రాజెక్ట్. వీటితో పాటు నా ఆల్‌ టైమ్ ఫేవరెట్‌ మెగాస్టార్‌ చిరంజీవిని డైరక్ట్ చేయాలనుకుంటున్నా” అని తన కోరికలను బయట పెట్టారు. బన్నీ-ఎన్టీఆర్ - ఆమిర్-ప్రభాస్.. ఈ కాంబినేషన్‌ లలో మల్టీస్టారర్‌ లు చేస్తే అవి ఖచ్చితంగా భీభత్సం సృష్టిస్తాయి. కానీ మల్టీస్టారర్‌ తీయాలంటే ఇద్దరు హీరోలు ఓకే అనాలి. అలాంటి స్టార్‌ లతో భారీ సినిమాలు తీసేందుకు నిర్మాతలు ముందుకు రావాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దర్శకుడి కోరిక భవిష్యత్‌ లో నెరవేరుతుందో లేదో తెలీదు. ప్రస్తుతం స్వరూప్ ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సీక్వెల్‌ ను ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పై అధికారిక ప్రకటన చేస్తానని తెలిపాడు.