Begin typing your search above and press return to search.
బాహుబలి తరువాత ప్రభాస్ ఫీట్ పెద్దదే
By: Tupaki Desk | 19 Sept 2016 11:00 PM ISTఇప్పుడు అందరూ కూడా బాహుబలి 2 రిలీజ్ గురించే ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ అభిమానుల క్యాలుక్లేషన్లు మాత్రం వేరుగా ఉన్నాయి. నిజానికి బాహుబలి సినిమా అనేది ఊహించని దానికంటే పెద్దగా అయిపోయింది. ఈ సినిమాతో ప్రభాస్ రేంజ్ కూడా బాగా పెరిగింది. అయితే బాహుబలి 2 రిలీజ్ అయిపోయాక.. ప్రభాస్ పదే పదే అదే రేంజును అందుకుంటూ ఉండాలి. అప్పుడే బాక్సాఫీస్ దగ్గర టాపర్ అవుతాడు. ఇప్పుడు ఫ్యాన్స్ ఈ విషయం గురించే ఆలోచిస్తున్నారు.
అందుకే ఇప్పుడు ప్రభాస్ కూడా ఈ విషయం సీరియస్ గానే తీసుకున్నాడు. మొన్నటివరకు ఏమో అనుకున్నాం గాని.. ఇప్పుడు ఈ కండలవీరుడు తదుపరి సుజిత్ డైరక్షన్ లో తీయబోయే సినిమాను ఏకంగా 80 కోట్ల బడ్జెట్ తో రూపొందిస్తున్నారంటే. అంతెందుకు అంటే.. ఒకేసారి సినిమాను తెలుగు - తమిళం - హిందీలలో రిలీజ్ చేయనున్నారు. మూడు బాషల్లోనూ డైలాగులు రాయించి షూట్ చేస్తారట. అంటే ఇదే మన టాలీవుడ్ నుండి వస్తున్న తొలి ట్రై లింగువల్ సినిమా అవుతుందనమాట. ఈ సినిమాతో కూడా ప్రభాస్ ఒక 400 కోట్లుపైనే గ్రాస్ వసూలు చేసి.. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ - షారూఖ్ తదితరుల సరసన నిలవాలని చూస్తున్నాడనమాట.
నిజంగానే ఈ ఫార్మాట్ లో ప్రభాస్ సక్సెస్ అయ్యాడంటే.. అప్పుడు సౌత్ లో రజనీకాంత్ తరువాత స్థానం ప్రభాస్ కైవసం చేసుకోవడం ఖాయం. అయితే ఇలాంటి సినిమాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి సుమా!!