Begin typing your search above and press return to search.

ఏంటీ.. దసరా కంటే ఆదిపురుష్ తక్కువా?

By:  Tupaki Desk   |   6 Jun 2023 2:00 PM GMT
ఏంటీ.. దసరా కంటే ఆదిపురుష్ తక్కువా?
X
ఈ మధ్య కాలంలో ప్రపంచ వ్యాప్తంగా సెన్సేషన్ అవుతోన్న చిత్రాల్లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ ఒకటి. మైథాలజీ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఓం రౌత్ తెరకెక్కించడు. అత్యంత భారీ బడ్జెట్‌తో విజువల్ వండర్‌గా రాబోతున్న ఈ చిత్రంపై బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే దీన్ని హై రేంజ్‌లో తీశారు.

ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన ‘ఆదిపురుష్’ మూవీని జూన్ 16వ తేదీన విడుదల చేస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేయడంతో పాటు బిజినెస్, రిలీజ్ ఏర్పాట్లను శరవేగంగా జరుపుకుంటోంది. ముఖ్యంగా ఓవర్సీస్‌లో ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయిపోయాయి. దీంతో అంతటా ఆదిపురుష్ సందడే కనిపిస్తోంది.

విజువల్ వండర్‌గా రూపొందిన ‘ఆదిపురుష్’ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ బుకింగ్స్‌ గురించి తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అక్కడ ఈ చిత్రంపై హాలీవుడ్‌ మూవీ ‘ది ఫ్లాష్’ ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇది కూడా జూన్ 16నే రాబోతుంది. ఫలితంగా ‘ఆదిపురుష్’కు చాలా తక్కువ లొకేషన్లే దొరికినట్లు సమాచారం.

ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’పై ‘ది ఫ్లాష్’ మూవీ ఎఫెక్ట్ ఏ రేంజ్‌లో ఉందన్న దానిపై ట్రేడ్ వర్గాలు ఓ ఉదాహరణను కూడా చెబుతున్నాయి. కొద్ది రోజుల క్రితం విడుదలై నాని ‘దసరా’ మూవీ విడుదలకు పది రోజుల ముందు 200 లొకేషన్స్ ఓపెన్ అయ్యాయి. కానీ, ‘ఆదిపురుష్‌’ చిత్రానికి మాత్రం సరిగ్గా అదే పది రోజుల సమయం ఉండగా.. కేవలం 130 లొకేషన్లలోనే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి.

హాలీవుడ్ మూవీ నుంచి పోటీ ఉండడం వల్లే ‘ఆదిపురుష్’ ఒక తెలుగు సినిమాను కూడా చేరని పరిస్థితిని తెచ్చుకుందని అంటున్నారు. దీనివల్ల ఓవర్సీస్‌లో ప్రభాస్ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గిపోయే అవకాశం కూడా ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు రిలీజ్ నాటికైనా లొకేషన్ల సంఖ్యను పెంచుకుంటారో లేదో చూడాలి.