Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ బిజినెస్.. పెద్ద టెన్షన్ అయిపోయింది!

By:  Tupaki Desk   |   6 May 2023 3:39 PM IST
ఆదిపురుష్ బిజినెస్.. పెద్ద టెన్షన్ అయిపోయింది!
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్ దర్శకత్వంలో హిందీలో తెరకెక్కిన చిత్రం ఆదిపురుష్. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. టి-సిరీస్ భూషణ్ కుమార్ ఈ మూవీని నిర్మించారు. ప్రభాస్ శ్రీరాముడిగా, కృతి సనన్ సీతాదేవిగా, సైఫ్ ఆలీఖాన్ రావణుడిగా ఈ చిత్రంలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం ఉండటంతో మూవీకి మంచి బజ్ ఏర్పడింది.

అయితే టీజర్ తో ఆదిపురుష్ మూవీపై నెగిటివ్ టాక్ జనాల్లోకి వెళ్ళిపోయింది. దీంతో మరల ఆ నెగిటివ్ వైబ్ నుంచి బయటపడేందుకు చిత్ర యూనిట్ నానా తంటాలు పడుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ ప్రస్తుతం హడావుడిగానే జరుగుతున్నాయి. మరో వైపు బిజినెస్ డీల్స్ క్లోజ్ చేసుకునే పనిలో నిర్మాత భూషణ్ కుమార్ ఉన్నారు. మే 9న ఈ మూవీ ట్రైలర్ రిలీజ్ కానుంది.

దీంతో సినిమాపై అంచనాలు పెరుగుతాయని అందరూ భావిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్ లో ఆదిపురుష్ మూవీపై మరో టాక్ నడుస్తోంది. ఈ సినిమా తెలుగు వెర్షన్ కి సంబందించిన బిజినెస్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదంట. యూవీ క్రియేషన్స్ దగ్గర ఆదిపురుష్ తెలుగు వెర్షన్ ని రిలీజ్ రైట్స్ ఉన్నాయి.

అయితే వీటిని ఏరియా వైడ్ గా అమ్మేయాలని యూవీ నిర్మాతలు భావిస్తున్నారు. దిల్ రాజుతో పాటు మరికొంత మంది డిస్టిబ్యూషన్ కోసం ముందుకొచ్చిన ఇప్పటికే సాహో, రాధేశ్యామ్ ఫ్లాప్ ల కారణంగా వారు నష్టాలు పేస్ చేశారు. దీంతో ఇప్పుడు ఆదిపురుష్ డీల్ ఇంకా వారితో క్లోజ్ కాలేదంట. బిజినెస్ రేషియో డిసైడ్ అయ్యాక ఏరియా వారీగా థీయాట్రికల్ రైట్స్ ని తీసుకోవడానికి వారు సిద్ధంగా ఉన్నట్లు టాక్.

అయితే మే 9న ఆదిపురుష్ ట్రైలర్ రిలీజ్ తర్వాత మూవీపై ఒక అంచనాకి వచ్చేయొచ్చు. అప్పుడు థీయాట్రికల్ రైట్స్ పై మరింత స్పీడ్ పెరుగుతుందని చిత్ర యూనిట్ భావిస్తోంది. మొత్తానికి బాహుబలి తర్వాత ప్రభాస్ నుంచి వచ్చిన రెండు పాన్ ఇండియా సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు ఆదిపురుష్ మూవీపై పడిందనే మాట వినిపిస్తోంది.