Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: ప్ర‌భాస్ పై క‌ళ్లు భైర్లు క‌మ్మే బెట్టింగ్

By:  Tupaki Desk   |   3 Dec 2020 9:00 AM IST
ట్రెండీ టాక్‌: ప్ర‌భాస్ పై క‌ళ్లు భైర్లు క‌మ్మే బెట్టింగ్
X
బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా (వ‌ర‌ల్డ్) సినిమాల‌తో డార్లింగ్ ప్ర‌భాస్ పేరు మార్మోగుతోంది. బాహుబ‌లి 1.. బాహుబ‌లి 2 చిత్రాల‌తో ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాల హీరోగా అవ‌త‌రించాడు ప్ర‌భాస్. దేశంలోనే టాప్ 10 హీరోల జాబితాలో చేరిన సౌత్ హీరోగా అత‌డికి ఐడెంటిటీ ద‌క్కింది.

పాన్ ఇండియా స్టార్ హోదా ద‌క్కాక ప్ర‌భాస్ ప్లానింగ్ విష‌యంలో ఏమాత్రం త‌గ్గ‌లేదు. ఆ వెంట‌నే సాహో మ‌రో భారీ పాన్ ఇండియా చిత్రంగా తెర‌కెక్కి హిందీ బెల్టులో సంచ‌ల‌నాలు న‌మోదు చేసింది. యాక్ష‌న్ స్టార్ గా ప్ర‌భాస్ కి మంచి గుర్తింపు తెచ్చింది ఈ మూవీ. ప్ర‌స్తుతం రాధేశ్యామ్ అనే పూర్తి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ మూవీకి భారీ బ‌డ్జెట్ ని వెచ్చిస్తున్నారు మేక‌ర్స్. ఇది తెలుగు-త‌మిళం-హిందీ స‌హా దేశంలోని చాలా భాష‌ల్లో విడుద‌లవుతుంది. ఇంత‌లోనే బ్యాక్ టు బ్యాక్ మ‌రో మూడు పాన్ ఇండియా సినిమాల్ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు.

నాగ్ అశ్విన్ తో సైన్స్ ఫిక్ష‌న్ మూవీ.. ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి .. కేజీఎఫ్ ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ తో స‌లార్ బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలు సృష్టించ‌గ‌ల ఇండ‌స్ట్రీ రికార్డులు బ్రేక్ చేయ‌గ‌ల స‌త్తా ఉన్న పాన్ వ‌ర‌ల్డ్ సినిమాలే అవుతాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ఈ లైన‌ప్ చూస్తుంటే ప్ర‌భాస్ స్థాయి ఏ రేంజుకు చేర‌నుందో ఊహించ‌వ‌చ్చు.

మూడు సినిమాలు అద్భుతమైన బడ్జెట్ ‌లతో నిర్మించబడతాయి. విస్తృత పాన్ ఇండియన్ విడుదలను కలిగి ఉంటాయి. ప్రభాస్ అటువంటి యూనివ‌ర్శ‌ల్ అప్పీల్ ఉన్న స్క్రిప్టుల్ని స్టార్ డ‌మ్ ఉన్న దర్శకులను ఎంపిక చేసుకున్నాడు. ఈ మూడింటితో పాటు త‌దుప‌రి య‌ష్ రాజ్ ఫిలింస్ నిర్మించే ధూమ్ 4లో న‌టిస్తే గ‌నుక అత‌డి రేంజు మ‌రో లెవ‌ల్ కి చేరిపోతుంద‌న్న అంచనాలు ఉన్నాయి.

ఇక ప్ర‌భాస్ సినిమా అంటే వంద‌ల కోట్ల పెట్టుబ‌డులు అంత‌కు రెండింత‌ల థియేట్రిక‌ల్ బిజినెస్.. క్రేజీగా శాటిలైట్ డిజిట‌ల్ బిజినెస్ ఉంటుంది. ఇదంతా ఊహిస్తుంటేనే క‌ళ్లు భైర్లు క‌మ్మే ప‌రిస్థితి ఉంది. ఒక్కో సినిమాకి మినిమంగా 300-400 కోట్ల బ‌డ్జెట్లు పెడితే కానీ పూర్త‌వ్వ‌ని రేంజు స్క్రిప్టుల్ని ప్ర‌భాస్ ఎంచుకున్నాడు. అంత‌కుమించి పెట్టుబ‌డులు వెద‌జ‌ల్లినా తిరిగి బ‌య్య‌ర్లు పంపిణీదారుల నుంచి తెచ్చేసే స‌త్తా ఉన్న హీరో కాబ‌ట్టి అన్ని భాష‌ల్లో వ‌ర్క‌వుట‌వుతుంద‌న్న ధీమాతో భారీగా పెట్టుబ‌డులు పెట్టేస్తున్నారు.

ఇక ఒక్కో సినిమా బాహుబ‌లి రేంజులో వ‌ర్క‌వుటైతే మినిమంగా అన్ని భాష‌లు క‌లుపుకుని 500-600 కోట్లు వ‌సూలు చేసినా అటుపై ఇత‌ర‌త్రా మార్గాల్లో వ‌చ్చేదంతా డ‌బుల్ బోన‌స్ కిందే లెక్క‌. ప్ర‌భాస్ లైన‌ప్ లో ఉన్న నాలుగైదు సినిమాల‌కు క‌లుపుకుని మినిమం 1200-1500కోట్లు పెట్టుబ‌డులు పెట్టినా అంత‌కు డ‌బుల్ ట్రిపుల్ రాబ‌డి ఉంటుంద‌న‌డంలో సందేహ‌మేం లేదు. బిజినెస్ వ‌ర్గాల్లో ఇది సంచ‌ల‌నంగానే ఉంటుంది. ఇక దేశంలో వేరొక స్టార్ ఎవ‌రూ ట‌చ్ చేయ‌లేని రేంజుకు ప్ర‌భాస్ ఎదిగిన‌ట్టేన‌న్న అంచ‌నా వేస్తున్నారు విశ్లేష‌కులు. బాలీవుడ్ లో ఏజ్డ్ హీరోల హ‌వా త‌గ్గుతున్న నేప‌థ్యంలో ప్ర‌భాస్ గ్రాఫ్ పైపైకి పాకుతుండ‌డం చూస్తుంటే అత‌డికి మ‌హ‌ర్ధ‌శ ముందుంద‌ని అర్థ‌మ‌వుతోంది.
Tags: