Begin typing your search above and press return to search.
పాన్ ఇండియా హీరోలతో పోటీ గురించి ప్రభాస్ ఏమన్నారంటే..?
By: Tupaki Desk | 16 April 2022 8:00 AM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా వెలుగొందుతున్నారు. 'బాహుబలి' సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న డార్లింగ్.. ఆ క్రేజ్ ని కాపాడుకునేలా సినిమాలు చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలో సౌత్ ఇండియా నుంచి మరికొందరు సహీరోలు ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ డమ్ తెచ్చుకున్నారు.
'పుష్ప' చిత్రంతో అల్లు అర్జున్ కు పాన్ ఇండియా స్థాయిలో ఫ్యాన్ బేస్ ఏర్పడింది. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాతో ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు కూడా ఇప్పుడు నేషనల్ వైడ్ కగుర్తింపు తెచ్చుకున్నారు. 'కేజీఎఫ్' మూవీతో కన్నడ హీరో యష్ సైతం పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఈ నేపథ్యంలో లేటెస్టుగా ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో ఇతర పాన్ ఇండియా హీరోలతో పోటీ గురించి స్పందించారు.
ఎన్టీఆర్ - రామ్ చరణ్ - యశ్ వంటి హీరోల నుంచి పోటీ ఎదుర్కొంటున్నారా అని ప్రభాస్ ను అడగ్గా.. ''పోటీ అనేది ఎక్కడైనా సహజం. కానీ అది మీరు అనుకుంటేనే. ఇప్పుడు సినిమాలకి దేశవ్యాప్తంగా మంచి మార్కెట్ ఏర్పడింది. మా తాత 'మైనే ప్యార్ కియా' సినిమా చూసి సల్మాన్ ఖాన్ కి ఫ్యాన్ గా మారిపోయారు. అంటే ఎప్పటి నుంచో ఇలాంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఈ మధ్య ఎక్స్‌పోజర్ ఎక్కువైంది అంతే. చివరకు అందరం కలిసి భారతీయ సినిమాలు చేస్తున్నాం'' అని బదులిచ్చారు.
''నిజానికి రాబోయే రోజుల్లో మనం భారతీయ సినిమాని కూడా దాటబోతున్నాం. అందుకే ఇక్కడ ప్రత్యర్థి అనేదానికి చోటు లేదు. ఇలాంటి సినిమాలను రూపొందించడం ఇప్పటికే ఆలస్యమైందని నేను భావిస్తున్నాను. ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి నార్త్ - సౌత్ యాక్టర్స్ అంతా కలిసి భారతీయ చిత్రాలను చేయబోతున్నాం. అందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది'' అని ప్రభాస్ అభిప్రాయ పడ్డారు.
ఇక RRR సినిమా గురించి ప్రభాస్ మాట్లాడుతూ.. ''నేను సినిమా చూశాను. నాకు చాలా నచ్చింది. అది వెయ్యి కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించడం సంతోషంగా ఉంది. ఇప్పుడు రాజమౌళి కేవలం సౌత్ డైరెక్టర్ కాదు.. ఇండియన్ డైరెక్టర్'' అని చెప్పుకొచ్చారు.
ప్రభాస్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల 'రాధేశ్యామ్' సినిమాతో పరాజయం మూటగట్టుకున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో 'ఆదిపురుష్' మూవీలో నటిస్తున్నారు. ప్రశాంత్ నీల్ తో చేస్తున్న 'సలార్' సినిమా సెట్స్ మీద ఉంది. అలానే నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో 'ప్రాజెక్ట్ K' అనే పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతోంది. ఇదే క్రమంలో సందీప్ వంగా తో 'స్పిరిట్' చిత్రం చేయనున్నారు. ఇక మారుతి దర్శకత్వంలో ఓ మూవీని పట్టాలెక్కించనున్నారు.