Begin typing your search above and press return to search.

పెళ్లికి రాజమౌళి టైమివ్వడే -ప్రభాస్‌

By:  Tupaki Desk   |   20 July 2015 12:14 PM IST
పెళ్లికి రాజమౌళి టైమివ్వడే -ప్రభాస్‌
X
టాలీవుడ్‌ లో సీనియర్‌ బ్యాచిలర్‌ ప్రభాస్‌ పెళ్లెప్పుడు చేసుకుంటాడు? ఈ సందేహం అటు మగువల్లో, ఇటు యువతరంలో ఎప్పటికప్పుడు మెదులుతూనే ఉంటుంది. అయితే దీనికి ప్రభాస్‌ చెప్పిన సమాధానం చాలా వెరైటీగా ఉంది. 'అసలు పెళ్లి చేసుకుందాం అంటే రాజమౌళి టైమే ఇవ్వడం లేదు. ప్రస్తుతానికి పెళ్లి గిల్లీ జాన్తా నయ్‌ .. దృష్టంతా సినిమాల పైనే' అంటూ కరాఖండి గా చెప్పేశాడు. అసలు డ్రీమ్‌ గాళ్‌ గురించి ఆలోచించే సమయమే లేదనేశాడు.. అంతేనా ఇంకా బోలెడన్ని పాయింట్లు ముచ్చటించాడు.

=బాహుబలి విజయాన్ని ఆస్వాధిస్తున్నా. ముఖ్యంగా తమిళ్‌ లో బాహుబలి హిట్టవుతుందనుకున్నాం.. కానీ ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అనుకోలేదు.

=బాహుబలి 2లో శివుడు పాత్ర కేవలం 30నిమిషాలు కనిపిస్తుంది. మొదటి భాగం లో మిస్సయిన రొమాన్స్‌ ని రెండో భాగం లో ఆవిష్కరిస్తారు. ఇప్పటికే 40శాతం షూటింగ్‌ పూర్తయింది. సెప్టెంబర్‌ లో రెగ్యులర్‌ చిత్రీకరణకు వెళతాం.

=ప్రస్తుతం యూరప్‌ లో 15రోజులు హాలీడే ఎంజాయ్‌ చేస్తున్నా. స్నేహితుల తో కలిసి ఈ ట్రిప్‌ల ఉన్నా.

=బాహుబలి లాభాల్లోంచి షేర్‌ తీసుకుంటున్నా అన్నదాంట్లో నిజం లేదు. అయితే నా అంచనాల్ని మించి నాకు పారితోషికం వస్తుందనే అంచనా వేస్తున్నా. వర్మ చెప్పినదాంట్లో నిజం లేదు.

=తమిళ్‌ లో అజిత్‌, సూర్య, కార్తీ గురించి తెలుసు. సూర్య చాలా గ్రౌండెడ్‌ పర్సనాలిటీ. అలాగే అజిత్‌ మంచి మనస్తత్వం ఉన్న హీరో. ఆ సంగతిని రానా చెప్పాడు.

=నేను తమిళ్‌ లో నటించడానికి రెడీ. అయితే సరైన కథ రావాలి. అయితే ఎలాంటి క్యారెక్టర్‌ లో చేస్తాను అనే దానిపై క్లారిటీ లేదింకా.