Begin typing your search above and press return to search.
తిరుపతిలోనే పెళ్లి.. క్లారిటీ ఇచ్చేసిన డార్లింగ్ ప్రభాస్
By: Tupaki Desk | 6 Jun 2023 11:36 PMప్రభాస్ నటించిన పాన్ ఇండియా మూవీ `ఆదిపురుష్` ప్రీ-రిలీజ్ వేడుక తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేదికపైనే చినజీయార్ స్వామీజీ ప్రభాస్ బృందానికి ఆశీస్సులు అందించారు. అయితే ఇదే వేదికపై ప్రభాస్ ని వ్యక్తిగతంగా ప్రశ్నిస్తూ పెళ్లెప్పుడు? అని అడిగాడు ఓ అభిమాని. దానికి వెంటనే సరదాగా స్పందిస్తూ `నేను తిరుపతి లో వివాహం చేసుకుంటాను`` అంటూ టీజ్ చేసారు.
ఈ భారీ ఈవెంట్ కోసం సుదూర తీరాల నుంచి వచ్చిన ఆడియెన్ అంతా భారీ వర్షం కారణంగా తడిసి ముద్దయ్యారు. అయినా ప్రభాస్ ఈవెంట్ ని మాత్రం వదిలిపెట్టలేదు. ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలు మాట్లాడేందుకు ఆసక్తి కనబరచని ప్రభాస్ ఈసారి వేదికపై ప్రతిదీ ఓపెన్ గా అలవోకగా పెళ్లి గురించి మాట్లాడేయడంతో అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది.
చాలా కాలంగా ప్రభాస్ బయటపడడం లేదు. తన వ్యక్తిగత జీవితాన్ని దాచిపెడతాడే కానీ బహిర్గతం చేయడు. ఇది అభిమానులు మీడియా వర్గాల్లో అనేక ఊహాగానాలకు ఉత్సుకతకు దారితీసింది. ప్రీ-రిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ వ్యాఖ్య అతనిలో హాస్యం టైమింగ్ ని గొప్పగా ప్రదర్శించింది. ప్రభాస్ ఆన్సర్ నిజమైనది సముచితమైనది. ప్రభాస్ వివాహం గురించి కొనసాగుతున్న ఊహాగానాలకు ఉల్లాసభరితమైన మలుపును జోడించడం ఆసక్తిని కలిగించింది.
తాజా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉత్కంఠతో పాటు అంచనాలను పెంచింది. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విజువల్ వండర్ గా ఉంటుందని ట్రైలర్ చెబుతోంది. సినీ ప్రేక్షకులలో విపరీతమైన బజ్ ని తెచ్చేందుకు అవసరమైన కంటెంట్ ఈ చిత్రంలో ఉంది. జూన్ 16న ఆదిపురుష్ ప్రేక్షకుల ముందుకు రానుంది.