Begin typing your search above and press return to search.

ఇది దేశానికి అత్యంత విలువైన చిత్రం!- ప్ర‌భాస్

By:  Tupaki Desk   |   3 Oct 2022 4:21 AM GMT
ఇది దేశానికి అత్యంత విలువైన చిత్రం!- ప్ర‌భాస్
X
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ఆదిపురుష్‌. తానాజీ ఫేం ఓంరౌత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. కృతి స‌నోన్ సీత పాత్రలో న‌టించింది. ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. అయోధ్య‌లో ఆదిపురుష్ టీమ్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల్ని ప్రారంభించ‌డం ఆస‌క్తిక‌రం.

ప్ర‌చార కార్యక్ర‌మాల్లో భాగంగా ప్ర‌భాస్ మాట్లాడుతూ-''రాముడు ఆద‌ర్శ‌పురుషుడు. ఆయ‌న‌లా జీవించ‌డం ఎవ‌రికీ సాధ్యం కాదు. అందుకే ఆయ‌న దేవుడ‌య్యాడు. మ‌నం మ‌నుషులుగా ఉన్నాం'' అని అన్నారు. త‌న జీవితంలో అత్యంత విలువైన చిత్రం ఆదిపురుష్‌ అని ప్రభాస్ అన్నారు. 2023 లో మోస్ట్ అవైటెడ్ భారతీయ చిత్రాలలో ఒకటైన 'ఆదిపురుష్' మొదటి టీజర్ ఇప్ప‌టికే అభిమానుల్లోకి దూసుకెళ్లింది.

ఆదిపురుష్ అంటే 'మొదటి మనిషి' అని అర్థం. కానీ ఇక్కడ 'ఉత్తమ పురుషుడు' అని అర్థం చేసుకోవ‌చ్చు. ఆదిపురుష్ చిత్రానికి వాల్మీకి రచించిన రామాయణం స్ఫూర్తి అని ఓం రౌత్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ చిత్రం 7000 సంవత్సరాల క్రితం జరిగిన క‌థ‌తో తెర‌కెక్కింది. ప్రభాస్ పాత్రను లార్డ్ రామ్ అని కాదు.. రాఘవ గా క‌నిపిస్తాడ‌ని ఇది రామ్ కు మరో పేరు అని కూడా తెలిపారు.

కృతి సనన్ పోషించిన సీత పాత్ర‌ను జానకి అని పిలుస్తారు. జాన‌కి అంటే జ‌న‌క‌రాజు కుమార్తె. సైఫ్ అలీ ఖాన్ ని రావణుడు అని కాకుండా లంకేష్ (లంక ప్రభువు) అని పిలుస్తారు. రామాయ‌ణంలో పేర్ల‌ను య‌థాత‌థంగా ఉప‌యోగించ‌కుండా ఇలా ఇత‌ర పేర్ల‌తో ప్ర‌స్థావిస్తారు. క‌థ‌ను న‌డిపిస్తారు.

''మూడు రోజుల తర్వాత నేను కొంచెం ఒత్తిడికి గురయ్యాను. ఎందుకంటే ఇది దేశానికి అత్యంత విలువైన చిత్రం అని నేను భావించాను.. నేను చేయగలనా?'' అని అనుకున్న‌ట్టు ప్రభాస్ ఆ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ఆందోళన చెందవద్దని ఓం చెప్పాడు కాబట్టి ఇది చాలా అందమైన విషయం. ఇది నా జీవితంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రంగా భావిస్తున్నాను. రౌత్ ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే .. భారతదేశ చరిత్ర సంస్కృతిని తెర‌పై చూపించే అవ‌కాశం.. ఇవి రెండూ తాను సంతకం చేయ‌డానికి కార‌ణ‌మ‌ని ప్రభాస్ చెప్పాడు. సినిమాను ఆయన డిజైన్ చేసిన విధానం అద్భుతంగా అత్యంత‌ భారీగా ఉంది. అంత‌కుమించి విజువ‌ల్ గా బాగా చేసారని అనుకుంటున్నాను'' అని ప్రభాస్ అన్నారు.

ఓంరౌత్ మాట్లాడుతూ-''నేను రాఘవ్ పాత్రను రాసేటప్పుడు నా మనస్సులో ఎప్పుడూ ప్రభాస్ ఉండేవాడు. అది నాకు చాలా స్ఫూర్తినిచ్చేది'' అని ఓంరౌత్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించారు. ప్ర‌భాస్ కాకపోతే నేను ఈ సినిమా చేసేవాడిని కాదు అని కూడా ఆయ‌న అన్నారు. కోవిడ్ లాక్ డౌన్ స‌మ‌యంలో ప్రభాస్ తో వ్యక్తిగతంగా సినిమా గురించి చర్చించడానికి ఓంరౌత్ ముంబై నుండి హైదరాబాద్ కు చేరుకున్నాడు. నాటి సమావేశాన్ని సూపర్ ఎక్సైటింగ్ డే అంటూ అత‌డు అభివర్ణించారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.