Begin typing your search above and press return to search.
#ప్రభాస్ Vs సైఫ్: `ఆదిపురుష్` ఘనమైన ఆరంభం
By: Tupaki Desk | 2 Feb 2021 9:00 AM ISTప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆదిపురుష్. సెలబ్రేటింగ్ విక్టరీ ఆఫ్ గుడ్ ఓవర్ ఈవిల్ (దుష్ఠశక్తిపై మంచి గెలుపును సెలబ్రేట్ చేసుకుందాం) అనేది క్యాప్షన్. తానాజీ ఫేం ఓంరౌత్ ఈ చిత్రానికి దర్శకుడు. టీసిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.
నేటినుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఆ మేరకు డార్లింగ్ ప్రభాస్ స్వయంగా ఇన్ స్టా వేదికగా డై హార్డ్ ఫ్యాన్స్ కి సమాచారం చేరవేశారు. సాధ్యమైనంత వేగంగా రెగ్యులర్ చిత్రీకరణను పూర్తి చేయనున్నారని సమాచారం.
ఇక ఈ మూవీలో ప్రభాస్ శ్రీరాముడిగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రలో కృతి సనోన్ నటించనుందని ప్రచారమవుతోంది. అయితే కాస్టింగ్ పై అధికారికంగా మరిన్ని వివరాలు వెల్లడి కావాల్సి ఉంటుంది. ఇప్పటికే శ్రీరాముడి గెటప్.. రావణ్ గెటప్ పైనా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. రావణుడిగా సైఫ్ రూపాన్ని ఎలివేట్ చేస్తూ రాక్షసత్వానికి సింబాలిక్ గా ఉండే వివాదాస్పద డైలాగ్ హీట్ పుట్టించిన సంగతి తెలిసిందే. దీనికి సైఫ్ సారీ కూడా చెప్పారు.