Begin typing your search above and press return to search.

'ప్రభాస్‌25' డిసెంబర్‌ అప్‌డేట్ తెలుసా?

By:  Tupaki Desk   |   12 Sep 2021 1:34 PM GMT
ప్రభాస్‌25 డిసెంబర్‌ అప్‌డేట్ తెలుసా?
X
బాహుబలి సినిమాకు దాదాపుగా నాలుగు ఏళ్లు.. సాహోకు రెండు మూడు ఏళ్లు.. రాధే శ్యామ్‌ కు కూడా అదే స్థాయిలో టైమ్‌ తీసుకున్న ప్రభాస్ తదుపరి సినిమాల విషయంలో మాత్రం ఏమాత్రం ఆలస్యం చేయడం లేదు. ప్రస్తుతం రాధే శ్యామ్‌ విడుదలకు సిద్దంగా ఉంది. మరో వైపు సలార్ మరియు ఆదిపురుష్‌ లు షూటింగ్‌ చకచక జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరి వరకు ఆ రెండు సినిమాల షూటింగ్ లకు గుమ్మడి కాయ కొట్టే అవకాశాలు ఉన్నాయి.

ఇక ఇదే ఏడాది చివరి నుండి నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ ప్రాజెక్ట్‌ కే రెగ్యులర్‌ షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న సినిమాలు పూర్తి అయ్యే వరకు కొత్త సినిమా లకు కమిట్ అవ్వక పోవచ్చు అని అంతా అనుకుంటున్నారు. కాని ప్రభాస్ మాత్రం ఒక వైపు సినిమాను విడుదలకు సిద్దం చేస్తూ.. మరో వైపు రెండు సినిమాలు షూటింగ్‌ లో ఉండగా రెండు కొత్త సినిమాలను లైన్ లో పెట్టాడు.. మరి కొన్ని సినిమాలకు కమిట్‌ అవుతున్నాడు.

మొత్తానికి ప్రభాస్‌ జోరు అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుంది. ప్రభాస్ ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ సినిమా ను దిల్ రాజు నిర్మించబోతున్న విషయం తెల్సిందే. దిల్ రాజు బ్యానర్ లో రూపొందబోతున్న ప్రభాస్‌ 25వ సినిమాకు సంబంధించిన ప్రచారం రెగ్యులర్ గా జరుగుతూనే ఉంది. ఇటీవలే ఈ సినిమాకు బృందావన టైటిల్ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మీడియాలో ప్రభాస్‌ 25వ సినిమా టైటిల్‌ వృందావన అని కూడా ప్రచారం జరిగింది. టైటిల్ విషయంలో క్లారిటీ లేదు. కాని తాజాగా ఈ సినిమా డిసెంబర్‌ లో లాంచనంగా ప్రారంభం కాబోతుంది అంటూ సమాచారం అందుతోంది.

సినిమా చిత్రీకరణ మొదలు పెట్టడానికి ఇప్పటికే దిల్‌ రాజు కసరత్తులు మొదలు పెట్టాడు. ఇటీవలే శంకర్‌.. చరణ్‌ ల కాంబోలో భారీ సినిమాను మొదలు పెట్టిన దిల్ రాజు వచ్చే డిసెంబర్‌ లో ప్రభాస్‌ 25వ సినిమా పూజా కార్యక్రమాలను లాంచనంగా మొదలు పెట్టేందుకు గాను రెడీ అవుతున్నారని తెలుస్తోంది. ప్రభాస్ తో దిల్ రాజు గతంలో నిర్మించిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా అంతకు మించి ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను పీరియాడిక్ డ్రామాగా రూపొందించబోతున్నారట.

అతి త్వరలోనే సినిమా కు సంబంధించిన మరన్ని విషయాలు వెళ్లడిస్తారేమో చూద్దాం. ప్రభాస్‌ రాధే శ్యామ్‌ సంక్రాంతికి విడుదల కాబోతుంది. సలార్ కూడా వచ్చే ఏడాదిలోనే విడుదల అయ్యేలా ప్లాన్‌ చేశారు. ఆదిపురుష్‌ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేయాలని భావించారు. కాని షూటింగ్ ఆలస్యం అవ్వడం వల్ల వచ్చే ఏడాది విడుదల అనుమానంగానే ఉంది అంటున్నారు. కనుక 2023 లో ఆదిపురుష్‌ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రాజెక్ట్‌ కే కూడా 2023 లో విడుదల అవుతుందని అంటున్నారు. ప్రభాస్‌ 25వ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ సినిమా 2024 లో విడుదల అయ్యేనో చూడాలి.