Begin typing your search above and press return to search.

మూడింటిలో ప్రభాస్ మొదటగా సలార్‌ కోసం..!

By:  Tupaki Desk   |   17 May 2021 6:45 AM GMT
మూడింటిలో ప్రభాస్ మొదటగా సలార్‌ కోసం..!
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు సినిమాలు చేస్తున్నాడు. మూడు సినిమాలు చర్చల దశలో ఉండగా నాల్గవ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. ఇవి కాకుండా మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇన్ని సినిమాలను లైన్‌ లో పెట్టిన ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమా లు చేసుకుంటూ వెళ్తూనే ఉండాలి. లేదంటే ఏళ్లకు ఏళ్లు ఈ సినిమాలకు సమయం పడుతుంది. అందుకే వరుసగా సినిమాలు చేయాలని పక్కా ప్లానింగ్‌ తో ముందుకు వెళ్తున్నాడు. కాని కరోనా ఆయన ప్లాన్స్ ను తల కిందులు చేస్తూనే ఉంది. ఇప్పటికే ప్రభాస్ సినిమాల విడుదల తేదీల్లో మార్పులు చేశారు.

రాధే శ్యామ్‌ ముగింపు దశకు చేరుకోగా సలార్ మరియు ఆదిపురుష్‌ సినిమాలు షూటింగ్‌ మద్యలో ఉన్నాయి. ప్రస్తుతం లాక్ డౌన్ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా షూటింగ్‌ లకు బ్రేక్‌ వేశారు. షూటింగ్స్ పునః ప్రారంభం అయితే ప్రభాస్ మొదటగా చేయబోతున్న సినిమా ఏంటీ అంటే ఆయన న్యూలుక్ తో సలార్‌ లో నటించబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ప్రభాస్ వచ్చే నెల ఆరంభంలో సలార్‌ సినిమా షూటింగ్‌ లో జాయిన్ అవ్వబోతున్నాడు. రెండు మూడు వారాల పాటు షూటింగ్‌ లో పాల్గొని ఆ తర్వాత రాధేశ్యామ్‌ ను చేయబోతున్నాడు.

ఈ రెండు సినిమాలు చేస్తూనే మద్య మద్యలో ఆదిపురుష్‌ షూటింగ్‌ లో కూడా ప్రభాస్ కనిపిస్తాడని తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ మూడు సినిమాలతో పాటు తదుపరి సినిమా నాగ్‌ అశ్విన్ సినిమా కూడా ఈ ఏడాదిలో శరవేగంగా గ్యాప్ లేకుండా పూర్తి చేయబోతున్నారు. రాధే శ్యామ్‌ ను ఈ ఏడాదిలో విడుదల చేయబోతుండగా.. వచ్చే ఏడాది ఆరంభంలో సలార్ ను తీసుకు రాబోతున్నారు. ఇక ఆదిపురుష్ ను వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల చేస్తారట. నాగ్‌ అశ్విన్‌ మూవీ 2022 లో విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి.