Begin typing your search above and press return to search.

#ప్రభాస్20 టైటిల్స్ హంగామా అగట్లేదే!

By:  Tupaki Desk   |   13 Oct 2018 6:32 PM GMT
#ప్రభాస్20 టైటిల్స్ హంగామా అగట్లేదే!
X
ప్రభాస్ మొదట 'బాహుబలి:ది బిగినింగ్' అన్నాడు.. ఆ తర్వాత 'ది కంక్లూజన్' అన్నాడు అన్నిటికీ సరే అన్నారు ప్రేక్షకులు. ఎలాగో అవి రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్లు కావడంతో సంతోషపడ్డారు. ఇక ఏడాది నుండి 'సాహో' అంటున్నాడు.. వచ్చే ఏడాది గానీ ప్రేక్షకుల ముందుకు రాదు. అంతలోపే తన నెక్స్ట్ సినిమా #ప్రభాస్20 షూటింగ్ కూడా మొదలు పెట్టాడు. ఇప్పుడు ఆ సినిమాకు సంబంధించిన చర్చలే సాగుతున్నాయి.

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా 1970 లలో యూరోప్ నేపథ్యంలో తెరకెక్కే ప్రేమ కథ అని ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఈ సినిమా మెజారిటీ భాగం ఇటలీలో షూటింగ్ జరుపుకుంటుందట. ఇక ఈ సినిమా టైటిల్స్ గురించి జోరుగా టాక్ వినిపిస్తోంది. మొదట 'ఆమూర్ 1970' అనే టైటిల్ అని వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ తో ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. ఫ్రెంచ్ భాషలో 'అమూర్' అంటే ప్రేమ అని.. సినిమాకు దాదాపుగా ఇదే టైటిల్ కన్ఫామ్ అని ప్రచారం జరిగింది. తాజాగా గోపికృష్ణ మూవీస్ బ్యానర్ వారు 'జాను' అనే టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించడంతో ఇదే టైటిల్ ని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

ఈ సినిమా టైటిల్ ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 23 న ప్రభాస్ పుట్టిన రోజు నాడు రిలీజ్ చేస్తారని అంటున్నారు. ఇదిలా ఉంటే షూటింగ్ లోకేషన్ స్టిల్స్ సోషల్ మీడియాలో జోరుగా హల్చల్ చేస్తున్నాయి. రెట్రో లుక్ లో ఉన్న ప్రభాస్ పిక్స్ కి ఫ్యాన్స్ లైకుల మీద లైకులు కొడుతున్నారు.