Begin typing your search above and press return to search.

కాలికేయుడికి ఫీవర్‌ వచ్చేసిందమ్మోయ్‌

By:  Tupaki Desk   |   13 July 2015 8:11 PM IST
కాలికేయుడికి ఫీవర్‌ వచ్చేసిందమ్మోయ్‌
X
మనిషిని చూస్తేనే అర ఎకరం తడిసిపోతుందేమో అన్నట్లున్నాడు కాలికేయ. రాజమౌళి తీసిన అద్భుత చిత్రం ''బాహుబలి'' సినిమాలో సెకండాఫ్‌లో మెయిన్‌ విలన్‌గా విపరీతమైన ప్రశంసలు అందుకున్న కాలికేయ ఉన్నాడు చూడండి.. అతడు ఎవరో తెలిసిందే. మర్యాద రామన్న సినిమాలో చిన్నకొడుకుగా తన అత్యద్భుత నటనతో ఆకట్టుకున్న ప్రభాకర్‌, ఈ సినిమాలో భయంకరమైన అడివి జాతి గెటప్‌ వేశాడు. ఆ క్రూరమైన గెటప్‌ చూసేసిరికి ఎవరికైనా 102 డిగ్రీల జ్వరం రావల్సిందే మరి.

అయితే ఈ గెటప్‌ వేశాక ప్రబాకర్‌కే జ్వరం వచ్చేసింది. ఇంతకీ కారణం ఏమైయుంటుంది అంటారూ? ''తొలిరోజున కాలికేయ గెటప్‌ వేసుకొని వెళ్లి రాజమౌళి గారికి చూపించిన వెంటనే ఆయన సూపర్‌ ఉంది అన్నారు. కాని అందరూ చూసి బాగుందంటూ దిష్ఠి పెట్టేయడంతో ఇక నాకు రాత్రికి జ్వరం వచ్చేసింది'' అని చెప్పుకొచ్చాడు ప్రభాకర్‌. మనోడికే తన గెటప్‌ వలన జ్వరం వచ్చేసిందంటే.. ధియేటర్‌లో సినిమాను చూస్తున్న చిన్నపిల్లల పరిస్థితి ఏంటో చూసుకోండి మరి.

కాలికేయ అనే పదం వింటేనే ముందుగా ప్రభాకర్‌ గెటప్‌ ఆ తరువాత కిలికి బాష గుర్తొచ్చేస్తుంది ఎవరికైనా. తన భయంకరమైన గెటప్‌తోనే కాకుండా, కేవలం రెండే రెండు ఎక్స్‌ప్రెషన్లతో ఇరగదీశాడు ప్రభాకర్‌. అందుకే ఈ సినిమా రివ్యూల్లో మనోడికి ఫుల్‌ మార్కులేశారందరూ...