Begin typing your search above and press return to search.

MAA వార్: మోహ‌న్ బాబు తిట్లు వింటుంటే ర‌క్తం మ‌రిగింది!

By:  Tupaki Desk   |   13 Oct 2021 4:32 AM GMT
MAA వార్: మోహ‌న్ బాబు తిట్లు వింటుంటే ర‌క్తం మ‌రిగింది!
X
ఆయన ప్ర‌వ‌ర్త‌నకు క‌డుపు కాలిందంటూనే.. ఆయ‌న వార‌సులు లేక‌పోతే గొడ‌వ‌ల‌య్యేవి! అంటూ క‌వ‌ర‌ప్ చేసారు బుల్లితెర వెండితెర న‌టుడు.. ఈటీవీ ప్ర‌భాక‌ర్. మంచు మోహ‌న్ బాబు దురుసుత‌నం గురించి ప్ర‌స్థావిస్తూ మంచు మ‌నోజ్- విష్ణుల డిగ్నిటీని పొగిడేశారు.

`మా` ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైన ప్ర‌కాష్ రాజ్ ప్యాన‌ల్ స‌భ్యుల రాజీనామాలు చేయ‌డం వేడెక్కించిన సంగ‌తి తెలిసిందే. మీడియా స‌మావేశంలో న‌టుడు ప్ర‌భాక‌ర్ ఎంబీ వ్య‌వ‌హారంపై ఆవేద‌న‌ను క‌న‌బ‌రిచారు. `సినిమా బిడ్డ‌లం` ప్యానెల్ లో ఉన్న బెన‌ర్జీ-త‌నీష్ ల‌పై మోహ‌న్ బాబు ప్ర‌వ‌ర్తించిన తీరును ప్ర‌భాక‌ర్ త‌ప్పు ప‌ట్టారు. పెద్ద‌ల‌ను ప్ర‌శ్నించినా ఎదురించినా ఇర‌వై ఏళ్లు వెన‌క్కి వెళ్లిపోతామ‌నే భ‌య‌ప‌డుతున్నాను. నేను నా పిల్ల‌లు ఇదే రంగంలో కొన‌సాగాలి. అందుకే ఏమీ అన‌లేక రాజీ ప‌డుతున్నాన‌ని ప్ర‌భాక‌ర్ అన్నారు. ఎంబీ దురుసుత‌నం న‌చ్చ‌లేద‌ని సూటిగానే చెప్పారు.

అదే స‌మ‌యంలో మంచు మ‌నోజ్ లేక‌పోయి ఉంటే ఘ‌ర్ష‌ణ పెరిగేద‌ని విష్ణు - మ‌నోజ్ హుందాగా ప్ర‌వ‌ర్తించార‌ని పొగిడేశారు. తండ్రి లాంటి వ్య‌క్తి.. కానీ తిట్లు వింటుంటే ర‌క్తం మ‌రిగిపోయింద‌ని .. ప్ర‌శ్నించ‌లేక‌పోయాన‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసిన ప్ర‌భాక‌ర్.. ప్ర‌శ్నిస్తే ఏమ‌వుతుందో త‌న‌కు అనుభ‌వ‌మేన‌ని కూడా అన్నారు. ఎన్నికల రోజున విష్ణు మ‌నోజ్ లేక‌పోయి ఉంటే పెద్ద ర‌చ్చ‌య్యేద‌ని సూచ‌న‌ప్ర‌యాంగా తెలిపారు. అలాగే సంయ‌మ‌నం పాటించిన బెన‌ర్జీ.. ప్ర‌కాష్ రాజ్ ల‌ను ఆయ‌న పొగిడేశారు.

మూకుమ్మడిగా రాజీనామాలు..

`మా` ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ప్రకాశ్ రాజ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. `సినిమా బిడ్డలం` ప్యానెల్ నుంచి గెలుపొందిన అభ్యర్థులు అందరూ మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారని.. నరేష్ ప్రవర్తన సరిలేదని.. క్రమశిక్షణ లేకుండా బెనర్జీ లాంటి సీనియర్ నటుడిపై చేయి చేసుకున్నారని ప్రకాష్‌ రాజ్ ఆరోపించారు. ఎన్నికల్లో మొదటి రోజు గెలిచినవారు రెండో రోజు ఎలా ఓడిపోయారని.. రాత్రికి రాత్రే ఫలితాలు మారాయని.. క్రాస్ ఓటింగ్ జరిగిందని.. పోస్టల్ బ్యాలెట్స్ లో అన్యాయం జరిగిందని ప్రకాష్ రాజ్ అన్నారు. మోహన్ బాబు ఎ‍న్నికల ప్రక్రియలోనే కూర్చున్నారని.. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తెచ్చారని తెలిపారు.

గత రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్ సభ్యులతో చర్చించామని.. ఇలాంటి వాతావరణంలో పని చేయగలమా అని గెలిచిన సభ్యులు అన్నారని.. అందుకే `మా` సంక్షేమం కోసం అందరం కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.