Begin typing your search above and press return to search.

పడి పడి లేచే మనసు క్లోజింగ్ కలెక్షన్స్

By:  Tupaki Desk   |   8 Jan 2019 12:50 PM IST
పడి పడి లేచే మనసు క్లోజింగ్ కలెక్షన్స్
X
హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్.. సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం 'పడి పడి లేచే మనసు'. క్రిస్మస్ సీజన్ సందర్భంగా డిసెంబర్ 21న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన రోజునుండే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ పై పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.

ఇప్పటికే ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తయింది.. క్లోజింగ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ ప్రపంచవ్యాప్తంగా రూ. 22.5 కోట్లకు అమ్ముడయ్యాయి. కానీ ఫైనల్ రన్ లో సినిమా 35% ఇన్వెస్ట్మెంట్ మాత్రమే రికవరీ చేయగలిగింది. ఇండియాలోనే కాకుండా అమెరికాలో కూడా ఈ సినిమా నష్టాలే మిగిల్చింది. బ్రేక్ ఈవెన్ కోసం $900k గ్రాస్ కలెక్షన్స్ సాధించాల్సి ఉండగా $315k గ్రాస్ తో మాత్రమే సరిపెట్టుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 7.97 కోట్ల షేర్ మాత్రమే వసూలు చేసింది. దర్శకుడు హను రాఘవపూడి.. శర్వానంద్ లకు వారి కెరీర్లలో ఈ సినిమా మరో డిజాస్టర్.

ప్రపంచ వ్యాప్తంగా 'పడి పడి లేచే మనసు' ఏరియా వైజ్ కలెక్షన్స్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజామ్: 2.61 cr
సీడెడ్: 0.84 cr
ఉత్తరాంధ్ర: 0.82 cr
ఈస్ట్ : 0.42 cr
వెస్ట్: 0.32 cr
కృష్ణ: 0.49 cr
గుంటూరు: 0.62 cr
నెల్లూరు: 0.31 cr

ఏపీ + తెలంగాణా: రూ. 6.43 cr

రెస్ట్ అఫ్ ఇండియా: 0.48 cr

ఓవర్సీస్: 1.06 cr

వరల్డ్ వైడ్ టోటల్: రూ. 7.97 cr (డిస్ట్రిబ్యూటర్ షేర్)