Begin typing your search above and press return to search.
హీరో నుంచి జీరో! ఎవరో ప్రేక్షకులకు తెలియదా?
By: Tupaki Desk | 17 Jun 2023 6:40 PM ISTజనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో భాగంగా రాజకీయ ఉపన్యాసాన్ని ఉద్దేశించి దర్శకుడు రాంగోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. `నన్ను సీఎం చేయండి..ఒక్క ఛాన్స్ అంటూ పవన్ కళ్యాణ్ అభ్యర్ధనపై వర్మ తనదైన శైలిలో ఎద్దేవా చేసారు. పవన్ కళ్యాణ్ కన్నీళ్లు పెట్టుకుంటూ అడుక్కుంటున్నారని.. ఆయన కులం వ్యక్తుల్లో.. అభిమానుల గుండెల్లో హీరోయిజం నుంచి జీరోయిజం కి వచ్చారని విమర్శించారు. దీంతో ఈ వ్యాఖ్యలపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఎవరు హీరో నుంచి జీరో అయ్యారో? తెలుసంటూ వర్మపై ఎటాకింగ్ దిగారు. కోట్లాది మంది అభిమానించే స్టార్ పవన్ కళ్యాణ్. నటుడిగా సినిమాలు చేసింది తక్కువే అయినా వ్యక్తిత్వం అభిమానుల గుండెల్లో దేవుడయ్యాడు. మెగాస్టార్ చిరంజీవి వెనుకున్నా ఆయన సహాయం కెరీర్ ఆరంభంలో తప్ప! మిగతా అన్ని సందర్భాల్లోనూ స్వయంగా ఎదిగిన నటుడు. గొప్ప మానవతా వాధిగా ప్రేక్షకుల్లో స్థానం సంపాదించారు.
ఎంత ఎత్తుకి ఎదిగినా ఒదిగి ఉండే ఆ లక్షణం పీకే స్థాయిని అంతకంతకు పెంచుతుంది. ఆయన నిజంగా మనసు పెట్టి సినిమాలు చేస్తే బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సినిమా అని తెలియదా? నిజంగా ఆయన పాన్ ఇండియా సినిమా చేస్తే! దేశ వ్యాప్తంగా ఆయనకున్న ఫాలోయింగ్ తోనే కోట్ల వసూళ్లు సాధించగలరు. వందల కోట్టు బడ్జెట్ తో పీకేతో సినిమా నిర్మించడానికి ఎంతో మంది బడా నిర్మాతలు క్యూలో ఉన్నారు.
ఆయన వ్యక్తిత్వం నచ్చి నటులు.. నిర్మాతలెంతో మంది స్వచ్ఛందంగా పార్టీలో చేరుతున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ ని జీరో అనడం వర్మ విజ్ఞతకే వదిలేయాలి. ఒక సారి వర్మ కెరీర్ సంగతి చూస్తే ఒకప్పుడు ఇండియాలోనే గ్రేట్ టెక్నీషియన్ గా వర్మకి పేరుంది. ఎన్నో హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఎంతో మంది స్టార్లను డైరెక్ట్ చేసారు. మరి ఇప్పుడా పేరు ఏమైంది? ఇప్పుడా క్రేజ్ ఏమైంది? స్టార్ హీరో ఎవరైనా అతనికిప్పుడు పిలిచి అవకాశాలిస్తున్నారా? ఆ కోణంలో చూస్తే! హీరో నుంచి జీరో కి పడిపోయింది ఎవరు? ఆయనా? ఈయన ? అన్నది ఓసారి పరిశీలిస్తే తెలియదా? అంటూ పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.