Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డేకు ఒక్క రోజు ముందే సంజ‌య్ సాహూ హంగామా!

By:  Tupaki Desk   |   29 Aug 2022 11:45 AM GMT
బ‌ర్త్ డేకు ఒక్క రోజు ముందే సంజ‌య్ సాహూ హంగామా!
X
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు న‌టించిన 'పోకిరి' మూవీని 4కెలోకి మార్చి మ‌హేష్ పుట్టిన రోజున వ‌ర‌ల్డ్ వైడ్ గా ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించిన విష‌యం తెలిసిందే. ఈ మూవీ కోసం ప్ర‌త్యేకంగా 375 షోలు ప్లాన్ చేశారు. ప్ర‌తీ షో హౌస్ ఫుల్ అయి సంచ‌ల‌నం సృష్టించింది. చాలా రోజుల త‌రువాత మ‌హేష్ న‌టించిన ఇండ‌స్ట్రీ హిట్ మూవీని 4 కెలోకి మార్చి పుట్టిన రోజు గిఫ్ట్ గా అభిమానుల కోసం రిలీజ్ చేయ‌డంతో థియేట‌ర్ల వ‌ద్ధ‌, థియేట‌ర్ల‌లో అభిమానులు చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

ప్ర‌పంచ వ్యాప్తంగా నిర్వ‌హించిన 'పోకిరి' స్పెష‌ల్ షోల ద్వారా రూ. 1. 72 ల‌క్ష‌లు వ‌సూళు కావ‌డం విశేషం. ఇన్నేళ్ల త‌రువాత కూడా 'పోకిరి' క్రేజ్ ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని ఈ వ‌సూళ్లు నిరూపించ‌డంతో ఫ్యాన్స్ సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఈ మూవీతో ప్ర‌తీ ఒక్క హీరో ఫ్యాన్స్ ఆలోచ‌న‌లో ప‌డ్డారు. మా హీరో మెమ‌ర‌బుల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ని కూడా 4కెలోకి మార్చి బ‌ర్త్ డే స్పెష‌ల్ గా రిలీజ్ చేయాలంటూ మేక‌ర్స్ ని డిమాండ్ చేయ‌డం మొద‌లు పెట్టారు.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు గీత ఆర్ట్స్ వారిని 'జ‌ల్సా' మూవీని 4కెలోకి మార్చి రిలీజ్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేశారు. మొత్తానికి ఫ్యాన్స్ అభ్య‌ర్థ‌న‌ని సానుకూలంగా స్వీక‌రించిన మేక‌ర్స్ ఎట్ట‌కేల‌కు ప‌వ‌న్ క‌ల్యాణ్, త్రివిక్ర‌మ్ ల తొలి క‌ల‌యిక‌లో వ‌చ్చిన‌ 'జ‌ల్సా' మూవీ ప్రింట్ ని 4కెలోకి మార్చేసి రిలీజ్ కి రెడీ చేశారు. సెప్టెంబ‌ర్ 2న ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పుట్టిన రోజు వేడుక‌లు జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలోనే 'జ‌ల్సా' 4 కె ప్రింట్ కు సంబంధించిన ప్ర‌త్యేక షోల‌ని వ‌ర‌ల్డ్ వైడ్ గా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారు. ప‌వ‌న్ పుట్టిన రోజుకు ఒక్క రోజు ముందే అంటే సెప్టెంబ‌ర్ 1నే సంజ‌య్ సాహూ థియేట‌ర్ల‌లో హంగామా చేయ‌బోతున్నాడు. 4కె డాల్బీ స్టీరియో ఫోనిక్ సౌండ్ లో 'జ‌ల్సా'ని ప్ర‌త్యేకంగా ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. 'పోకిరి'ని మించి అత్య‌థిక స్క్రీన్ ల‌లో ప్రివ్యూ షోల‌ని ప్ర‌ద‌ర్శించ‌డానికి అన్ని ఏర్పాట్లు చేసిన‌ట్టుగా తెలుస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు బెంగ‌ళూరు, చెన్నై తో పాటు యుఎస్ ల‌లో భారీ స్థాయిలో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టుగా తెలుస్తోంది. అత్య‌ధిక థియేట‌ర్ల‌లో రిలీజ్ చేస్తే గ‌న‌క ఫ్యాన్స్ ఊహిస్తున్న‌ట్టుగా 'జ‌ల్సా' మ‌హేష్ 'పోకిరి' 4కె ప్రీమియ‌ర్ రికార్డ్స్ ని అధిగ‌మించ‌డం ఖాయం అని చెబుతున్నారు. 'పోకిరి'కి 375 షోలు ప్లాన్ చేస్తే 'జ‌ల్సా' కోసం ఏకంగా 500 షోలు ప్లాన్ చేశార‌ట‌.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.