Begin typing your search above and press return to search.
పవన్ కళ్యాణ్ బర్త్ డే నాడు సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారా..?
By: Tupaki Desk | 17 July 2020 3:20 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లి కొన్నాళ్లు చిత్ర పరిశ్రమకు దూరమైన సంగతి తెలిసిందే. 'అజ్ఞాతవాసి' పరాజయం తరువాత పూర్తి జీవితం ప్రజాసేవకే అని గత ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించే ప్రయత్నం చేసారు. ఇక ఇప్పట్లో ఎన్నికలు కూడా లేకపోవడంతో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వాలని నిర్ణయించుకొని వరస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కెరీర్ లో ఎప్పుడూ లేని విధంగా ఏకకాలంలో రెండు సినిమాల షూటింగ్స్ లో పాల్గొనడంతో పాటు మరో సినిమాని లైన్లో పెట్టాడు. ఈ క్రమంలో ముందుగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' చిత్రాన్ని పట్టాలెక్కించాడు. హిందీ హిట్ సినిమా 'పింక్' రీమేక్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు మరియు బోణీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'వకీల్ సాబ్' మేజర్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయింది.
ఇక ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీ కమిట్ అయ్యాడు పవన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మించనున్నారు. 'విరూపాక్ష' అనే టైటిల్ ప్రచారంలో ఉన్న క్రిష్ సినిమా ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుందని సమాచారం. ఈ రెండు సినిమాలు త్వరగా కంప్లీట్ చేసి తన కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయాలని నిర్ణయించుకున్నారు పవన్. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయబోతున్నారని అధికారికంగా ప్రకటించారు. దీని ప్రకారమే ప్లాన్స్ వేసుకొని 'వకీల్ సాబ్' మిగతా భాగం షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ భావించారు. అయితే కరోనా మహమ్మరి కారణంగా ఈ రెండు సినిమాల షూటింగ్ లు వాయిదా పడ్డాయి. ఇప్పటికే నాలుగు నెలలు గడిచిపోయియింది.
కాగా పవర్ స్టార్ సినిమా నుంచి అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పవన్ ఫ్యాన్స్ కోసం సర్ప్రైజ్ రెడీ అవుతోందట. సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా 'వకీల్ సాబ్' మరియు క్రిష్ సినిమాల అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ సిద్ధమయ్యాయట. పవన్ పుట్టిన రోజున 'వకీల్ సాబ్' టీజర్ తో పాటు క్రిష్ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కానున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో పవర్ స్టార్ బర్త్ డే ట్రెండ్ చేయాలని ఫ్యాన్స్ ప్లాన్ చేస్తున్నారు. దీనికి తోడు పవర్ స్టార్ మూవీస్ అప్డేట్ వస్తే అభిమానులకు పండగే అని చెప్పవచ్చు.