Begin typing your search above and press return to search.

వాల్తేరు వీరయ్యలో పవర్ఫుల్ విలన్స్!

By:  Tupaki Desk   |   28 Dec 2022 7:54 AM GMT
వాల్తేరు వీరయ్యలో పవర్ఫుల్ విలన్స్!
X
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతికి గ్రాండ్ గా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ తోనే అంచనాలను పెంచేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కూడా అదిరిపోయింది అని ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది.

ఇక దర్శకుడు బాబి కూడా ఈ సినిమా విశేషాలను ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు చెబుతూ మంచి వైబ్రేషన్స్ అయితే క్రియేట్ చేస్తున్నాడు. ఇక రీసెంట్ గా చిత్ర యూనిట్ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టి హడావిడి చేశారు. దాంతో కూడా సినిమాకు కొంత హైప్ అయితే పెరిగింది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరికొన్ని విషయాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నాయి.

ఈ సినిమాలో రవితేజ మంచి నిడివి ఉన్న పాత్రలో కనిపించబోతున్న విషయం తెలిసిందే. తప్పకుండా వీరి కలయికలో వచ్చే మాస్ సన్నివేశాలు అలాగే ఎమోషనల్ సన్నివేశాలు కూడా అద్భుతంగా ఉంటాయి అని ఒక క్లారిటీ అయితే వచ్చేసింది.

ఇక ఈ సినిమాలో మెయిన్ విలన్స్ గా ఉండబోతున్న వారు కూడా చాలా పవర్ఫుల్ గా కనిపిస్తారట. ఇక సీనియర్ యాక్టర్ ప్రకాష్ రాజ్ కూడా అద్భుతమైన పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది.

అంతేకాకుండా తమిళ ప్రముఖ నటుడు బాబీ సింహం కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ తో మెగాస్టార్ తో పోటీ పడబోతున్నట్లు సమాచారం. వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో తెరపైకి రాబోతున్న ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని యాక్షన్ సన్నివేశాలు డైలాగ్స్ కూడా ప్రేక్షకుల చేత విజిల్స్ వేయిస్తాయని తెలుస్తోంది.

ముఖ్యంగా బాబీ సింహా పాత్ర కూడా సినిమా రేంజ్ ను పెంచే విధంగా ఉంటుందట. ఇక మెగాస్టార్ చిరంజీవి రవితేజ రెండు పాత్రలు కూడా ఒక యాక్షన్ సన్నివేశంలో పాల్గొంటారని తెలుస్తోంది. మరి ఈ సినిమా ఈ క్యాస్టింగ్ ద్వారా ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.