Begin typing your search above and press return to search.
చిరంజీవి తదుపరి చిత్రాల పవర్ ఫుల్ టైటిల్స్..?
By: Tupaki Desk | 20 Aug 2021 10:00 PM ISTమెగాస్టార్ చిరంజీవి యువ హీరోలతో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో తనయుడు రామ్ చరణ్ తో కలిసి 'ఆచార్య' సినిమాలో నటిస్తున్నారు. అలానే మోహన్ రాజా డైరెక్షన్ లో #Chiru153 ప్రాజెక్ట్ చేస్తున్నారు. దీని తర్వాత చిరంజీవి చేయబోయే మరో రెండు చిత్రాలపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. మెహర్ రమేష్ మరియు బాబీ (కేఎస్ రవీంద్ర) లతో సినిమాలు చేయనున్నాడు.
చిరు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ఈ చిత్రాలకు సంబంధించిన అఫిషియల్ అనౌన్సమెంట్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాదు బర్త్ డే స్పెషల్ పోస్టర్స్ తో పాటుగా టైటిల్స్ ని కూడా ప్రకటించనున్నారని టాక్ వినిపిస్తోంది. #Chiru153 చిత్రానికి ''గాడ్ ఫాదర్'' అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. మలయాళ బ్లాక్ బస్టర్ 'లూసిఫర్' రీమేక్ గా ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది. కొణిదెల సురేఖ సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్స్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ - ఎన్వీఆర్ సినిమా సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో 'వేదాళమ్' రీమేక్ లో చిరంజీవి నటించనున్నారు. ఇందులో కీర్తి సురేష్ కీలక పాత్ర పోషిస్తున్నారని సమాచారం. ఈ చిత్రానికి 'భోలా శంకర్' అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. చిరు కెరీర్ లో వచ్చే ఈ 154వ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించాల్సి ఉంది. అయితే మెగాస్టార్ నిర్మాత కెఎస్ రామారావు కు కమిట్ మెంట్ ఇవ్వడంతో.. ఈ ప్రాజెక్ట్ లో సీనియర్ ప్రొడ్యూసర్ కూడా భాగస్వామిగా చేరబోతున్నారట. అంటే ఏకే ఎంటర్టైన్మెంట్స్ మరియు క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తాయన్నమాట.
ఇకపోతే బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించే చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ నిర్మించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. అయితే #Chiru155 కు ''వాల్తేరు వీరయ్య'' అనే టైటిల్ అనుకుంటున్నట్లుగా ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. ఇది వైజాగ్ నేపథ్యంగా సాగే ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని టాక్. మెగాస్టార్ తదుపరి సినిమాల టైటిల్స్ నిజమా లేదా అవన్నీ పుకార్లేనా అనేది మరో రెండు రోజుల్లో తెలిసిపోతుంది.