Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ మొదటి అడుగు

By:  Tupaki Desk   |   10 Aug 2020 1:00 PM IST
ఎన్టీఆర్‌ ప్రశాంత్‌ నీల్‌ మూవీ మొదటి అడుగు
X
కేజీఎఫ్‌ చిత్రంతో కేవం సౌత్‌ లోనే కాకుండా బాలీవుడ్‌ లో కూడా పేరు దక్కించుకున్న దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని చేస్తున్నాడు. వచ్చే ఏడాదిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్‌ తో ఆయన సినిమా చేసే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ కాంబినేషన్‌ లో మూవీని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మొదటి అడుగు పడ్డట్లుగా తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితం దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ స్టోరీ లైన్‌ ను ఎన్టీఆర్‌ కు వినిపించాడట. దాదాపుగా గంట పాటు జూమ్‌ మీటింగ్‌ ద్వారా కథ చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. స్టోరీ లైన్‌ కు ఎన్టీఆర్‌ ఓకే చెప్పాడని స్క్రిప్ట్‌ వర్క్‌ ప్రారంభించే అవకాశం ఉందంటున్నారు. త్వరలోనే స్క్రిప్ట్‌ వర్క్‌ కూడా పూర్తి చేసే అవకాశం ఉంది. ఈ ఏడాది చివరి వరకు స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తానంటూ ప్రశాంత్‌ నీల్‌ చెప్పాడట. కేజీఎఫ్‌ 2 చిత్రం షూటింగ్‌ పూర్తి అయ్యే లోపు ఎన్టీఆర్‌ తన ఆర్‌ ఆర్‌ఆర్‌ మరియు త్రివిక్రమ్‌ మూవీలను పూర్తి చేయాల్సి ఉంది.

వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఎన్టీఆర్‌ మరియు ప్రశాంత్‌ నీల్‌ ల మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. దాదాపుగా 200 కోట్ల బడ్జెట్‌ తో పాన్‌ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందించబోతున్నారట. స్క్రిప్ట్‌ డిమాండ్‌ మేరకు బడ్జెట్‌ ను పెంచేందుకు కూడా మేకర్స్‌ రెడీగా ఉన్నారట. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంతో ఎన్టీఆర్‌ కు పాన్‌ ఇండియా స్టార్‌ డం రావడం ఖాయం. ఇక ప్రశాంత్‌ నీల్‌ మార్కెట్‌ తో 200 కోట్లు అనేది చాలా ఈజీ అంటూ మెకర్స్‌ భావిస్తున్నారట. త్వరలో పూర్తి వివరాలు వెళ్లడయ్యే అవకాశం ఉంది.