Begin typing your search above and press return to search.

పవర్ హౌస్ లాంటి టైటిల్ ఫిక్స్ చేసిన 'ఎన్టీఆర్-ప్రశాంత్' నీల్ కాంబో!

By:  Tupaki Desk   |   10 Jun 2020 2:30 AM GMT
పవర్ హౌస్ లాంటి టైటిల్ ఫిక్స్ చేసిన ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబో!
X
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలో వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా 'ఆర్ఆర్ఆర్'లో నటిస్తున్నాడు. ఇక ఎన్టీఆర్ ఈ సినిమాలో కొమరం భీంగా కనిపించనున్నాడన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీ ఉంటూనే కొత్త సినిమా కోసం కథలు వింటూ తర్వాత ప్రాజెక్టులు ఓకే చేస్తున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా తరవాత ఎన్టీఆర్ త్రివిక్రమ్ తో మరో సినిమా చేయనున్నాడు. వీరి కాంబినేషన్లో సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అధికారికంగా సినిమా ప్రకటించిన చిత్రయూనిట్ 'అయినను పోయిరావలె హస్తినకు' అనే టైటిల్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఇక త్రివిక్రమ్ తో సినిమా తర్వాత మరో ప్రాజెక్ట్ కూడా పట్టాలు ఎక్కనున్నట్లు తెలుస్తుంది. కేజీఎఫ్ సినిమాతో అన్ని ఇండస్ట్రీలలో సంచలనం సృష్టించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడని వార్తలొస్తున్నాయి.

ఇక ఎన్టీఆర్ పుట్టిన రోజు ప్రశాంత్ ట్వీట్ ద్వారా అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. 'మీరు పక్కనుంటే న్యూక్లియర్‌ ప్లాంట్‌ దగ్గర కూర్చున్న భావన కలుగుతుంది. త్వరలో రేడియేషన్‌ సూట్‌ ధరించి మీ వద్దకు రాబోతున్నా' అని ప్రశాంత్‌నీల్ ట్వీట్ చేశాడు. దాంతో ఈ ఇద్దరి కాంబినేషన్ సెట్ అయిపోయిందని అభిమానులు ఫిక్స్ అయిపోయారు. అయితే ఇటీవలే ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మాణ సంస్థ వారు 'గొప్ప మనసు కలిగిన సంచలన దర్శకుడికి శుభాకాంక్షలు. త్వరలో మిమ్మల్ని రేడియేషన్‌ సూట్‌లో కలవబోతున్నాం' అని ట్వీట్ చేసింది. దాంతో ఎన్టీఆర్ సినిమాకు 'రేడియేషన్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఫిక్స్ చేయబోతున్నారంటూ సోషల్ మీడియాలో హడావిడి మొదలైంది. కానీ తాజాగా ఈ సినిమా కోసం రెండు టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. ఒకటి 'మిస్సైల్' కాగా.. రెండోది 'న్యూక్లియర్' అనే రెండు టైటిల్స్ రిజిస్ట్రేషన్ చేయబోతున్నట్లు సమాచారం. చూడాలి పవర్ ఫుల్ కాంబినేషన్ కాబట్టి టైటిల్ కూడా పవర్ ఫుల్ గా ఉండబోతుందేమో!