Begin typing your search above and press return to search.
సర్కారు వారి పవర్ ఫుల్ పోస్టర్.. తాళాల గుత్తితో మాస్ అవతార్ లో మహేష్..!
By: Tupaki Desk | 22 April 2022 7:58 PM ISTసూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న 'సర్కారు వారి పాట' సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. పరశురామ్ పెట్లా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటి వరకు విడుదల చేయబడిన ప్రమోషనల్ మెటీరియల్ మూవీపై బజ్ క్రియేట్ చేసింది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో దూకుడుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించడానికి మేకర్స్ రెడీ అయ్యారు.
తాజాగా 'సర్కారు వారి పాట' సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం కంప్లీట్ అయినట్లు మేకర్స్ ప్రకటించారు. హైదరాబాద్ లోని ఆర్‌ఎఫ్‌సీలో ఇటీవల పెండింగ్ సాంగ్ చిత్రీకరణ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. భారీ సెట్ లో మహేష్ - కీర్తి మరియు డ్యాన్సర్‌లపై ఓ మాస్ నంబర్ షూటింగ్ జరిపారు. ఇప్పుడు ఈ పాట చిత్రీకరణ పూర్తవడంతో.. సినిమా నిర్మాణ పనులన్నీ కంప్లీట్ అయ్యాయి. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
'SVP' మేకర్స్ ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పవర్ ఫుల్ పోస్టర్ ని వదిలారు. ఇందులో మహేశ్ బాబు తన రెండు చేతుల్లో తాళాల గుత్తిని పట్టుకుని కనిపిస్తున్నాడు. రౌడీ బ్యాచ్ తనవైపుకు వస్తుండగా.. వారిని ఢీకొట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు ఈ పోస్టర్ సూచిస్తుంది. మాస్ అండ్ ఇంటెన్స్ - టెర్రిఫిక్ స్టిల్ చూస్తుంటే ఇందులో యాక్షన్ పాళ్లు ఎక్కువనే విషయం స్పష్టం అవుతుంది. రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ ఈ సినిమాకు యాక్షన్ కొరియోగ్రఫీ చేశారు.
మ్యూజిక్ సెన్సేషన్ ఎస్ఎస్ థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. మేకర్స్ ఇప్పటివరకు 'కళావతి' మరియు 'పెన్నీ' అనే రెండు పాటలను విడుదల చేశారు. 'కళావతి' సాంగ్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకోగా.. సితార ఘట్టమనేని ఆడిపాడిన 'పెన్నీ' పాట సెన్సేషనల్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మూడవ పాటకు సమయం ఆసన్నమైంది. రేపు (ఏప్రిల్ 23) ఉదయం 11:07 గంటలకు సినిమా టైటిల్ సాంగ్ ని రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
'సర్కారు వారి పాట' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ - GMB ఎంటర్‌టైన్‌మెంట్ మరియు 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌లపై నవీన్ యెర్నేని - వై. రవిశంకర్ - రామ్ ఆచంట మరియు గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సముద్ర ఖని - ప్రకాష్ రాజ్ - వెన్నెల కిషోర్ - సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఆర్. మది సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటర్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. 'సర్కారు వారి...' సినిమా మే 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్స్ తో దూకుడుమీదున్న మహేష్.. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.