Begin typing your search above and press return to search.

ద‌ర్శ‌కుడికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప‌వర్ స్టార్‌

By:  Tupaki Desk   |   24 Dec 2021 8:35 AM GMT
ద‌ర్శ‌కుడికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ప‌వర్ స్టార్‌
X
ఇండ‌స్ట్రీలో వున్న స్టార్ హీరోల్లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ శైలి ప్ర‌త్యేకం అన్న‌ది తెలిసిందే. ఆయ‌న త‌న ఆనందాన్ని త‌న చుట్టూ వున్న వాళ్ల‌తో పంచుకుంటుంటారు. `గ‌బ్బ‌ర్ సింగ్` స‌క్సెస్ త‌రువాత ఈ అల‌వాటు మ‌రీ ఎక్కువైంది. ఆ సినిమాలో న‌టించిన విల‌న్ బ్యాచ్‌కి ప్ర‌త్యేకంగా మామిడి ప‌ళ్ల బుట్ట‌లు పంపి స‌ర్ ప్రైజ్ చేసిన ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆ త‌రువాత కూడా త‌నతో సినిమాలు చేసిన ద‌ర్శ‌కుల‌కు, నిర్మాత‌ల‌కు, న‌టీన‌టుల‌కు ఇచ్చారు.. ఇప్ప‌టికీ ఇస్తూనే వున్నారు.

తాజాగా త‌న‌కు `వ‌కీల్ సాబ్‌` సినిమాతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ని అందించిన ద‌ర్శ‌కుడికి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు ప‌వ‌న్‌. ఈ చిత్రానికి శ్రీ‌రామ్ వేణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాతో హీరోగా ప‌వ‌న్ కి మంచి పేరు తెచ్చిపెట్టిన ఆయ‌నపై విమ‌ర్శ‌కులు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. ఇండస్ట్రీ వ‌ర్గాలు ఆయ‌న‌పై అభినంద‌న‌ల వ‌ర్షం కురిపించారు. ఇదిలా వుంటే క్రిస్మ‌స్ సంద‌ర్భ‌గా ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ పంపించిన గిప్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇందుకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. ప‌వ‌న్ పంపిన క్రిస్మ‌స్ గిఫ్ట్ ని శ్రీ‌రామ్ వేణు భార్య ఓపెన్ చేశారు. ప‌వ‌న్ ప్ర‌త్యేకంగా పంపించిన గిఫ్ట్ బాక్స్ లో ఏమేమున్నాయో ఈ సంద‌ర్భంగా శ్రీ‌రామ్ వేణు భార్య గాయ‌త్రి శ్రీ‌రామ్ చూపిస్తూ ఓ వీడియోని చేశారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ వైఫ్ అన్నా లెజ‌నోవాతో పాటు ప‌వ‌న్ క‌ల్యాణ్ కు ఆమె అభినంద‌న‌లు తెలిపారు. గాయ‌త్రీ శ్రీ‌రామ్ ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది.

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ త‌న భార్య‌, పిల్ల‌ల‌తో క‌లిసి క్రిస్మ‌స్ వేడుక‌ల కోసం విదేశాల‌కు వెళ్లిన విష‌యం తెలిసిందే. తిరిగి హైద‌రాబాద్ వ‌చ్చాక కొంత విశ్రాంతి తీసుకుని క్రిష్ తెర‌కెక్కిస్తున్న `హ‌రి హ‌ర వీర మల్లు` చిత్రీక‌ర‌ణ లో పాల్గొంటార‌ట‌. ఇటీవ‌ల ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ స్క్రిప్ట్ సెష‌న్ ని క్రిష్‌, ప‌వ‌న్ లు నిర్వ‌హించిన విష‌యం తెలిసిందే.