Begin typing your search above and press return to search.
పంచభూతాలతో పవర్ స్టార్ టైటిల్ కార్డ్స్.. వైరల్!
By: Tupaki Desk | 1 May 2021 8:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ వకీల్ సాబ్. ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. అలాగే అదిరిపోయే కలెక్షన్స్ కూడా రాబట్టిందని టాక్. ఎందుకంటే సినిమా బ్లాక్ బస్టర్ అనేది తెలిసిందే.. కలెక్షన్స్ ఎంత రాబట్టిందనేది తెలియలేదు. అయితే మూడేళ్ల విరామం తర్వాత పవన్ కళ్యాణ్ తెరపై కనిపించడంతో అభిమానులు సినిమాను ఓ రేంజిలో భుజాలపై మోసారు. బాలీవుడ్ పింక్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కిన వకీల్ సాబ్.. మంచి సందేశంతో మహిళా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఫస్ట్ సినిమా ఇదే. అందుకే వకీల్ సాబ్ విషయంలో దిల్ రాజు ఎంత కేర్ తీసుకున్నాడో సినిమా చూస్తే అర్ధమవుతుంది.
వేణుశ్రీరామ్ దర్శకత్వంలో వకీల్ సాబ్ తెరకెక్కి మాంచి హిట్టు అందుకోవడంతో అతని కెరీర్లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే సినిమా ఆల్రెడీ థియేట్రికల్ రిలీజ్ తో పాటు ఓటిటి రిలీజ్ కూడా అయింది. ప్రస్తుతం వకీల్ సాబ్ సినిమా టైటిల్స్ గురించి సోషల్ మీడియాలో పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఏంటంటే.. వకీల్ సాబ్ టైటిల్ పడే సమయంలో పవర్ స్టార్ అనే పేరు ముందు స్టార్స్ డిజైన్ గురించి చర్చ నడుస్తుంది. ఎందుకంటే.. పవర్ స్టార్ అనే పేరుకు అర్ధం వచ్చేలా మేకర్స్ పంచభూతాలు స్టార్స్ ఒక్కచోట కలిపి పవర్ స్టార్ అనేది డిజైన్ చేశారు. మరి పవర్ స్టార్ లో పంచభూతాలు అనే కాన్సెప్ట్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. తమన్ మ్యూజిక్ తో ఆ టైటిల్స్ ఇంకా మరోస్థాయికి చేరుకోగా.. ఈ క్రెడిట్ అంతా డైరెక్టర్ దే అంటూ ఆయనకు ఫ్యాన్స్ థాంక్స్ చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఈ టాపిక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.