Begin typing your search above and press return to search.

ఇటు ప‌వ‌ర్ స్టార్‌.. అటు సోమూ వీర్రాజు.. మ‌ధ్య‌లో ‘భ‌ద్రం’గా క‌మెడియ‌న్‌!

By:  Tupaki Desk   |   14 March 2021 9:30 AM GMT
ఇటు ప‌వ‌ర్ స్టార్‌.. అటు సోమూ వీర్రాజు.. మ‌ధ్య‌లో ‘భ‌ద్రం’గా క‌మెడియ‌న్‌!
X
త‌న‌దైన కామెడీ టైమింగ్ తో న‌వ్వులు పూయిస్తూ తెలుగు తెర‌పై దూసుకుపోతున్నాడు యువ కమెడియన్ భ‌ద్ర‌మ్‌. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, శ‌త‌మానం భ‌వ‌తి, తాజాగా షాదీముబార‌క్ వంటి చిత్రాల ద్వారా త‌న టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ అవ‌కాశాలు చేజిక్కించుకుంటున్నాడు.

అయితే.. ఇవాళ ఉద‌యం ‘కొండంత బలం’ అంటే ఏంటో ఉదాహ‌ర‌ణ చూపించాడు భద్రమ్. తన ట్విటర్ అకౌంట్లో ఓ స్పెషల్ ఇమేజ్ ను పోస్టు చేశాడు. ఇందులో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ వైపు.. భ‌ద్ర‌మ్ మామ‌య్య‌, ఏపీ బీజేపీ చీఫ్ సోమూ వీర్రాజు మ‌రోవైపు నిల‌బ‌డ‌గా.. మ‌ధ్య‌లో నిల్చున్నాడీ యంగ్‌ క‌మెడియ‌న్‌.

ఈ ఫొటోకు అద్భుత‌మైన క్యాప్ష‌న్ కూడా రాశాడు. ‘కొండంత బలం అంటే ఇదేనేమో’ అని జత చేశాడు. ఈ ఫొటో సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ గా మారింది. నిజంగానే రెండు కొండ‌ల మ‌ధ్య ఉన్నావు బ్రో అని కామెంట్ చేస్తున్నారు నెటిజ‌న్లు.

కాగా.. భ‌ద్ర‌మ్ క‌మెడియ‌న్ గానే చాలా మందికి తెలుసు. కానీ.. ఆయ‌న ఆయుర్వేద వైద్యుడు కూడా. అంతేకాకుండా.. మ‌రో రోల్ కూడా ప్లే చేస్తుంటారు. ప్ర‌కృతి హితం కోరుకునే ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌గా కూడా ఉన్నారు భ‌ద్ర‌మ్‌.