Begin typing your search above and press return to search.

ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. కాల్ చేసింది ఎవరు??

By:  Tupaki Desk   |   22 July 2020 3:40 PM IST
ఊహించని ట్విస్ట్ ఇచ్చిన వర్మ.. కాల్ చేసింది ఎవరు??
X
వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తను చేసేపనినే వివాదాస్పదంగా చేస్తాడంటే.. అందులో ఎందరిని లాగాలో అందరినీ లాగేస్తుంటాడు. ఇటీవల సొంతంగా ఓటిటి ప్రారంభించిన వర్మ.. వరుసగా చిన్న, పెద్ద సినిమాలు రూపొందిస్తూ కాసులు వెనకేసుకుంటున్నాడు. ఇటీవలే నగ్నం, కరోనా వైరస్, మర్డర్ సినిమాలు వరుస పెట్టి రిలీజ్ చేస్తున్న ఆయన తాజాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై ఓ మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక ఎన్నికల అనంతరం అని కాప్షన్ మెన్షన్ చేసాడు. పవర్ స్టార్ పేరుతో రూపొందించిన తాజా సినిమాలో రాంగోపాల్ వర్మ.. పవన్ మాజీ భార్య రేణుదేశాయ్‌ విషయం కూడా వదల్లేదట.

ఇండైరెక్ట్ గానే ఆమెను టార్గెట్ చేసాడని టాక్. ఆర్జీవీకి వివాదాలు అంటే సరదా. అందుకే గత కొన్నేళ్లుగా సెలబ్రిటీలను, రాజకీయ నేతలను టార్గెట్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు. అయితే ఫస్ట్ నుండి కూడా వర్మ మెగా ఫ్యామిలీ పై కామెంట్స్ చేస్తూ హైలైట్ అయ్యేవాడు. ఇప్పటికే వర్మ పై మెగా హీరోలు కూడా కామెంట్స్ చేస్తూనే ఉన్నారు. తర్వాత వర్మ గురించి ఆలోచించడం మానేశారు. ఇక రాజకీయాల్లోకి ప్రవేశించాక పవన్ కల్యాణ్‌ పై ఫోకస్ పెట్టాడు వర్మ. ఇప్పటికే ఎన్నో కాంట్రవర్సీ సినిమాలు తెరకెక్కించిన వర్మ. తాజాగా పవన్ కల్యాణ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. ఎన్నికల ఫలితాల తర్వాత కథ అని వినిపిస్తున్న ఈ సినిమాను జూలై 25న 11 గంటలకు తన సొంత ఓటీటీ ఫ్లాట్‌ఫాం ‘ఆర్జీవీ వరల్డ్ థియేటర్'లో రిలీజ్ చేస్తున్నాడు.

ఫస్ట్ టైం పవర్ స్టార్ ట్రైలర్ చూడటానికే మనీ వసూల్ చేస్తున్నాడు. అయితే ట్రైలర్ లీక్ అవడం వలన మళ్లీ బుకింగ్ చేసుకున్న వారందరికీ డబ్బులు తిరిగిస్తామని తెలిపాడు. చెప్పినట్లే ముందుగా చూపించిన స్టిల్స్ ప్రకారంగా కొన్ని సీన్స్ జోడించాడట. అయితే ఎవరూ ఊహించలేని ఓ సన్నివేశం కూడా ఇందులో చూపించాడు వర్మ. అదే పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కు సంబంధించిన సన్నివేశం.. ట్రైలర్‌లో కనిపించడంతో అంతా ఖంగు తిన్నారు. పవన్ పాత్ర.. పూణే నుండి వచ్చిన కాల్ లిఫ్ట్ చేసి.. కాల్ చేసింది నేను కాదుగా! అన్నాడు. మొదటి పరిచయంతోనే ప్రేమలో పడిన పవన్.. కొన్నేళ్ల క్రితం విడిపోయి ఉంటున్నారు. అప్పటి రేణు ఒంటిగా తన పిల్లలతో కలిసి ఉంటుంది.