Begin typing your search above and press return to search.

ఆర్జీవీ `ప‌వ‌ర్ స్టార్` లీక్డ్ ట్రైల‌ర్

By:  Tupaki Desk   |   22 July 2020 9:30 AM IST
ఆర్జీవీ `ప‌వ‌ర్ స్టార్` లీక్డ్ ట్రైల‌ర్
X
ఆర్జీవీ అలియాస్ రామ్ గోపాల్ వ‌ర్మ్ ఏం చేసినా సంచ‌ల‌న‌మే. ఏదో ఒక వివాదం సృష్టించి ఏటీటీ సినిమాలు తీసి రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ ని పాపుల‌ర్ చేసేందుకు కంక‌ణం క‌ట్టుకున్నాడు. ఇందులో తొలిగా `ప‌వ‌ర్ స్టార్` మూవీని రిలీజ్ చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా పోస్ట‌ర్లు లీక్డ్ వీడియోల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌స్తోంది. గ‌డ్డి తింటావా? అంటూ ఇంత‌కుముందు ప‌వ‌ర్ స్టార్ మూవీ నుంచి సాంగ్ ని రిలీజ్ చేశాడు ఆర్జీవీ. ఇది ఫ‌న్ సెటైర్ తో ఆక‌ట్టుకుంది. అయితే ప‌వ‌న్ క‌ల్యాణ్ అభిమానులు మాత్రం ఆర్జీవీపై గుర్రుగా ఉన్నారు. సినిమాకి సినిమానే పంచ్ అన్న తీరుగా ఆర్జీవీ వేషాల‌కు కౌంట‌ర్ గా `ప‌రాన్న‌జీవి` అనే సెటైరిక‌ల్ సినిమాని ప‌వ‌న్ అభిమానులు నిర్మిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ నుంచి ఆర్జీవీపై సాంగ్ ని రిలీజ్ చేశారు. ప‌వ‌న్ అభిమానుల్లోకి ఈ పాట వైర‌ల్ గా దూసుకెళ్లింది.

`ప‌వ‌ర్ స్టార్` ఎల‌క్ష‌న్ రిజ‌ల్ట్ త‌ర్వాత క‌థ అని ఆర్జీవీ చెప్పిన‌ట్టే తాజాగా లీక్డ్ ట్రైల‌ర్ లో కంటెంట్ సెటైరిక‌ల్ గా క‌నిపిస్తోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ని `ప్ర‌వ‌ణ్ క‌ల్యాణ్` అనే పేరుతో పిలుస్తూ ఆర్జీవీ క్రియేట్ చేసిన పాత్ర‌ల‌న్నీ బోలెడ‌న్ని సెటైర్లు వేస్తున్నాయి. ఇక ఇందులోనే చంద్ర‌బాబు మాట విన్నందుకు ప‌వ‌న్ క‌ల్యాణ్ కి ఈ గతి ప‌ట్టింద‌ని... చెప్పుడు మాట‌లు విని మోస‌పోయినందుకు ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌య్యాన‌ని ప‌వ‌న్ గుర్తించిన‌ట్టు ఆర్జీవీ చెప్ప‌ద‌లిచారు. ఇక ఎన్నిక‌ల్లో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ పోటీ చేసిన రెండు చోట్లా ఓట‌మి పాల‌య్యాక అన్న‌య్య చిరంజీవి ఎంట్రీ ఇచ్చిన తీరును ఎంతో ఫ‌న్నీగా చూపించారు ట్రైల‌ర్ లో.

ఒక్క‌సీటు కూడా రాలేదా? అంటూ ప‌వ‌న్ ఆవేద‌న చెందుతుంటే నాదెండ్ల మ‌నోహ‌ర్ డైలాగ్ ఎంతో ఫ‌న్నీ. ``ఒక‌సారి గుండెల మీద చెయ్యేసుకుని చెప్పురా .. నువ్వు ప‌వ‌ర్ స్టార్ అయ్యింది కానిస్టేబుల్ కొడుకుగానా లేదా నా త‌మ్ముడిగానా?`` అంటూ చిరు డైలాగ్.. స‌త్య ప్ర‌మాణ‌కంగా చెబుతున్నాను బ్ర‌ద‌ర్.. మీరు ఓడిపోయినందుకు నేను చాలా బాధ‌ప‌డుతున్నాను.. అంటూ చంద్ర‌బాబు డైలాగ్.. త్రివిక్ర‌మ్ ని చొక్కా కాల‌ర్ ప‌ట్టుకుని ప‌వ‌న్ ఊపేసే సీన్.. మాట్లాడితే సీఎం సీఎం అని గోల‌లు.. ఈల‌లు అంటూ ప‌వన్ ఎమోష‌న్.. క‌త్తి మ‌హేష్ ఇంట‌ర్వ్యూ ఇవ‌న్నీ ఫ‌న్ సెటైర్ తో ప‌వ‌న్ అభిమానుల్ని మ‌రిగించేవిగానే ఉన్నాయి. ప్యాకేజ్ స్టార్ .. అస‌మ‌ర్థుడు అంటూ తిట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం చూస్తుంటే ఆర్జీవీపై ప‌వ‌న్ అభిమానులు క‌త్తులు నూర‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. ఈనెల 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్ లో ఈ సినిమా రిలీజ‌వుతుంది. ఇక ఈ మూవీ ఒరిజిన‌ల్ ట్రైల‌ర్ చూడాలంటే రూ.25 చెల్లించాల‌ట‌. మ‌రి ప‌వ‌న్ అభిమానులు ఈ మూవీని చూస్తారా లేదా? చూడాలి.