Begin typing your search above and press return to search.

విడుదలైన 8రోజులకే ఓటిటిలో పవర్ స్టార్ సినిమా..!

By:  Tupaki Desk   |   9 April 2021 3:30 AM GMT
విడుదలైన 8రోజులకే ఓటిటిలో పవర్ స్టార్ సినిమా..!
X
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ యువరత్న. 'ది పవర్ ఆఫ్ యూత్' అనేది ట్యాగ్ లైన్. సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ సినిమాను కేజీఎఫ్ ఫేమ్ విజయ్ కిరగందుర్ నిర్మించారు. అయితే ఈ సినిమా ఏప్రిల్ 1న కన్నడ, తెలుగు భాషల్లో ఒకే పేరుతో విడుదలైంది. ఎడ్యుకేషన్ సిస్టమ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా సందేశంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది కానీ.. కన్నడలో మాత్రమే హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగులో యువరత్న పెద్దగా కనెక్ట్ కాలేకపోయింది. సయేషా సైగల్ పునీత్ సరసన కథానాయికగా నటించింది.

కానీ అసలు విషయం ఏంటంటే.. ఈ పవర్ స్టార్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయినా ఎనిమిది రోజులకే డిజిటల్ రిలీజ్ అవుతుండటం గమనార్హం. గతవారమే విడుదలైన ఈ సినిమాను అప్పుడే డిజిటల్ రిలీజ్ ఏంటని అనుమానం రావచ్చు. కానీ ప్రస్తుతం కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ వణుకు పుట్టిస్తున్న కారణంగా వెంటనే ఈ సినిమాను డిజిటల్ రిలీజ్ చేసేయాలని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఏప్రిల్ 9 నుండి స్ట్రీమింగ్ కాబోతుంది. ఇప్పటికే కరోనా నేపథ్యం కారణంగా సినిమా థియేటర్స్ కూడా సరిగా రన్ అవ్వడం లేదు. జనాలు థియేటర్లకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ప్రొడ్యూసర్ తెలిపారు. అయితే డిజిటల్ స్ట్రీమింగ్ లో మాత్రం యువరత్న మూవీ.. తెలుగు, కన్నడతో పాటు తమిళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.