Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ తదుపరి సినిమాలు ఆపేసినట్లేనా..?

By:  Tupaki Desk   |   14 April 2020 2:30 AM GMT
పవర్ స్టార్ తదుపరి సినిమాలు ఆపేసినట్లేనా..?
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ సినీ ఇండస్ట్రీలో రీఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. దాదాపుగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు మరో చిన్న షెడ్యూల్ మిగిలి ఉందట. త్వరలోనే అది కూడా పూర్తిచేద్దాం అనుకునేలోపు కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేసింది. అందుకే షూటింగ్స్ ఆపేసి ఎక్కడివారక్కడే ఇళ్లకు అంకితమయ్యారు. పవర్ స్టార్ కూడా వకీల్ సాబ్ షూటింగులో ఉండగానే మరో కొన్ని ప్రాజెక్ట్ లను లైన్లో పెట్టారట. ఇదిలా ఉండగా కరోనా భయంతో షూటింగ్స్ నిలిచిపోవడం వలన వకీల్ సాబ్ టీం అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించిందట. ప్రస్తుతం వరుసగా మూడు ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేసి ఫ్యాన్స్ కోరిన దానికి రెట్టింపు చేశారు పవన్. ఆయన నుండి మొదటగా వకీల్ సాబ్ విడుదల కానుంది.

అలాగే క్రిష్ తో చేస్తున్న పీరియాడిక్ మూవీ వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇక హరీష్ శంకర్ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వేరే కొత్త సినిమాలేవీ ఓకే చేయకూడని ఫిక్స్ అయ్యారట. ఇప్పటికే నిర్మాతలు చాలా మంది ఆయన డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ పవన్ మాత్రం కొత్త చిత్రాలకు సంబందించిన ఒప్పందాలు ఆపేయాలని అనుకుంటున్నట్లు టాక్. లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం ఒప్పుకున్న చిత్రాలు ఎప్పుడు పూర్తి అవుతాయో తెలియని పరిస్థితి. కనుక కొత్త సినిమాలు ఒప్పుకుంటే అవి అసలు ఎప్పుడు పట్టాలెక్కుతాయో తెలియదు. అందుకే ముందు జాగ్రత్తగా ఆపేశారని సినీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి.