Begin typing your search above and press return to search.

థ‌మ‌న్ పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు సీరియ‌స్!

By:  Tupaki Desk   |   21 March 2021 4:17 AM GMT
థ‌మ‌న్ పై ప‌వ‌ర్ స్టార్ అభిమానులు సీరియ‌స్!
X
అల వైకుంఠ‌పుర‌ములో (2020) పాట‌ల్ని చార్ట్ బ‌స్ట‌ర్లుగా మ‌లిచిన ఎస్.ఎస్.థ‌మ‌న్ పేరు అన్ని పరిశ్ర‌మ‌ల్లోనూ మ‌ర్మోగుతోంది. ఇక ఇదే అద‌నుగా టాలీవుడ్ తో పాటు పొరుగు భాష‌ల్లోనూ థ‌మ‌న్ వ‌రుస‌గా క్రేజీ సినిమాల్ని ఖాతాలో వేసుకున్నారు. అటు కోలీవుడ్ శాండ‌ల్ వుడ్ లోనూ థ‌మ‌న్ దే హ‌వా. హిందీలోనూ థ‌మ‌న్ స్టార్ హీరోల‌తో ప‌ని చేస్తున్నారు.

ఇక ఇటు టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్.. అటు శాండ‌ల్వుడ్ ప‌వ‌ర్ స్టార్ ఇద్ద‌రినీ ఏక కాలంలో క‌వ‌ర్ చేస్తూ థ‌మ‌న్ రెండు ఇండ‌స్ట్రీస్ లోనూ హాట్ టాపిక్ గా మారారు. ఏప్రిల్ 9న రిలీజ‌వుతున్న `వ‌కీల్ సాబ్`.. ఏప్రిల్ 1న వ‌స్తున్న `యువ‌ర‌త్న` (క‌న్న‌డ‌)‌ ప్ర‌మోష‌న్స్ కోసం థ‌మ‌న్ చేయాల్సిన‌దంతా చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాల్లో ఈ రెండు చిత్రాల‌కు త‌న‌దైన శైలిలో ప్ర‌చారం చేస్తున్నారు. వ‌కీల్ సాబ్ నుంచి ఇప్పటికే రిలీజైన మూడు పాటలు మగువా మగువా- సత్యమేవ జయతే- కంటి పాప మంచి హిట్‌ అయ్యాయి.
ఈ సంద‌ర్భంగా వకీల్ సాబ్ మ్యూజికల్ ఫెస్ట్ ను హైదరాబాద్ దుండిగల్ ‌లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్ మెంట్ కాలేజీలో నిర్వహించ‌గా విద్యార్థుల మ‌ధ్య‌లో థ‌మ‌న్ హీమ్యాన్ లా ప్ర‌త్య‌క్ష‌మై ప్ర‌చారం చేశారు. లైవ్ కాన్సెర్టుతో స్టూడెంట్స్ ని అల‌రించారు. ప‌వ‌న్ తో ప‌ని చేయ‌డం త‌న క‌ల అని వ‌కీల్ సాబ్ మాస్ ట్రీట్ ఖాయ‌మ‌ని జోష్ ని నింపారు.

మ‌రోవైపు క‌న్న‌డ ప‌వ‌ర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ సినిమా యువ‌త‌ర్న‌కి థ‌మ‌న్ సంగీతం అందించారు. ఈ సినిమా ట్రైలర్ ని ట్విట్ట‌ర్ లో షేర్ చేసిన థ‌మ‌న్ ప‌వ‌ర్ స్టార్ గ్రాండ్ విక్ట‌రీ సాధిస్తార‌ని వ్యాఖ్యానించారు. దానికి రిప్ల‌య్ గా ఓ అభిమాని `ప‌వ‌ర్ స్టార్ అంటారు..! వేరే పేరు చెబుతారు! `` అంటూ అస‌హ‌నం క‌న‌బ‌రిచారు. వ‌కీల్ సాబ్ గురించి మాత్ర‌మే చెప్పాల‌ని ప‌వ‌న్ అభిమానులు ట్వీట్లతో థ‌మ‌న్ పై విరుచుకుప‌డ్డారు. మొత్తానికి థ‌మ‌న్ అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లోని అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారుతున్నారు.