Begin typing your search above and press return to search.

ఆకట్టుకుంటున్న 'పవర్ స్టార్' ఫ్యాన్ మేడ్ పోస్టర్!!

By:  Tupaki Desk   |   8 March 2021 7:21 AM GMT
ఆకట్టుకుంటున్న పవర్ స్టార్ ఫ్యాన్ మేడ్ పోస్టర్!!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం శరవేగంగా సినిమాలను ఫినిష్ చేసేపనిలో ఉన్నాడు. ఇప్పటికే వకీల్ సాబ్ సినిమాను పూర్తిచేసి రీఎంట్రీకి రెడీ అయిపోయాడు. భారీ అంచనాలను క్రియేట్ చేసిన వకీల్ సాబ్ మూవీ.. ఏప్రిల్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదివరకు రిలీజ్ చేసిన ఆ సినిమా టీజర్, సాంగ్స్ అమాంతం సినిమా పై అంచనాలను పెంచేసాయి. అయితే వకీల్ సాబ్ టైంలోనే పవన్ కళ్యాణ్.. అయ్యప్పనుమ్ కోషియం రీమేక్, డైరెక్టర్ క్రిష్ తో ఓ సినిమా, హరీష్ శంకర్ తో ఓ సినిమాను లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా వేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటుంది. చారిత్రాత్మక చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాలో పవన్ ఇంతకుముందు ఎన్నడూ చేయని పాత్రలో కనిపించనున్నాడు.

రాబిన్ హుడ్ టైప్ పాత్రలో పేదలకోసం పోరాడే బందిపోటుగా కనిపిస్తాడని తెలుస్తుంది. అలాగే చారిత్రక నేపథ్యం కాబట్టి ఈ సినిమా మొఘల్ రాజుల పాలన సమయంలో జరిగిన కల్పిత కథతో ఈ సినిమా తీస్తున్నట్లు సమాచారం. అయితే ఈ సినిమాను భారీ బడ్జెట్ తో సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఈ సినిమా న్యూ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎవరో పవర్ స్టార్ ఫ్యాన్ క్రియేట్ చేసిన ఆ పోస్టర్ ప్రస్తుతం పవన్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. పవర్ స్టార్ 'సర్దార్ గబ్బర్ సింగ్' పోజుతో క్రియేట్ చేసిన ఆ పోస్టర్ సినిమా పై అంచనాలను రెట్టింపు చేస్తోంది. పవన్ 27వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు 'హరహరవీరమల్లు' అనే టైటిల్ పరిశీలనలో ఉందట. మార్చ్ 11న శివరాత్రి సందర్బంగా ఈ సినిమా టైటిల్, టీజర్ విడుదల చేయనున్నారు మేకర్స్. ఎంఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.