Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్' మేకర్స్ తో పవర్ స్టార్ ''ద్విత్వ''

By:  Tupaki Desk   |   1 July 2021 12:30 PM GMT
కేజీఎఫ్ మేకర్స్ తో పవర్ స్టార్ ద్విత్వ
X
దక్షిణాది సినీ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ 'కేజీఎఫ్' సినిమాతో నేషనల్ వైడ్ పాపులర్ అయింది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన హోంబలే ఫిల్మ్ వారు.. 'కేజీఎఫ్: చాప్టర్ 2' చిత్రాన్ని విడుదలకు సిద్ధం చేస్తున్నారు. అలానే ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో 'సలార్' అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ క్రమంలో మరో పెద్ద ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టారు నిర్మాత విజయ్ కిరగందూర్. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ తో ఓ భారీ బడ్జెట్ సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

పునీత్ హీరోగా తెరకెక్కే చిత్రానికి ''ద్విత్వ'' (DVITVA) అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు మేకర్స్ వెల్లడించారు. 'ద్విత్వ' అంటే ద్వంద్వత్వం అని అర్థం. సైకాలజికల్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో పవర్ స్టార్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది. 'లూసియా' 'యు టర్న్' ఫేమ్‌ పవన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి పూర్ణ చంద్ర తేజస్వి సంగీతం సమకూరుస్తుండగా.. ప్రీత జయరామన్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

''ద్విత్వ'' సినిమా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో వస్తున్న తొమ్మిదవ ప్రాజెక్ట్. పునీత్ రాజ్ కుమార్ ఇంతకముందు ఇదే ప్రొడక్షన్ హౌస్ లో 'యువరత్న' అనే సినిమా చేశారు. 'ద్విత్వ' సినిమా షూటింగ్ ప్రారంభమైన తర్వాత ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు వెల్లడిస్తారమని మేకర్స్ తెలిపారు. 2021 సెప్టెంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది. పాన్ సౌత్ ఇండియా ప్రాజెక్ట్ గా వస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేయనున్నారు.