Begin typing your search above and press return to search.

ప‌వ‌ర్ స్టార్‌.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు!

By:  Tupaki Desk   |   11 Nov 2019 5:46 AM GMT
ప‌వ‌ర్ స్టార్‌.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు!
X
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌డం.. బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్లు కొట్ట‌డం త‌మిళ‌ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ కే చెల్లింది. ఆయ‌న ఓ యావ‌రేజ్ సినిమాలో న‌టించినా 150 కోట్లు వ‌సూలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. తేరి-మెర్స‌ల్‌- బిగిల్ ఇలా అన్నీ హిట్లే. ర‌జ‌నీకాంత్-అజిత్ లాంటి స్టార్లు ఉన్న త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో త‌న‌దైన మార్క్ సంచ‌ల‌నాల‌తో దూసుకుపోతున్న ది గ్రేట్ ద‌ళ‌ప‌తిగా నీరాజ‌నాలు అందుకుంటున్నాడు విజ‌య్.

అయితే అంత‌టి పాపులారిటీ ఉండీ ఆయ‌న క్ష‌ణ‌మైనా తీరికగా క‌నిపించ‌డు. అలుప‌న్న‌దే లేకుండా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో న‌టిస్తూ వేరే ఏ ఇత‌ర స్టార్ త‌న‌లా చేయ‌లేరు అని నిరూపిస్తున్నాడు. మొన్న‌నే బిగిల్ రిలీజైంది. ఈలోగానే వ‌చ్చే సమ్మ‌ర్ కి సినిమాని రెడీ చేసేస్తున్నాడు. అటుపైనా 2020 దీపావ‌ళిని విడిచిపెట్ట‌డం లేదు. అప్పుడు మ‌రో భారీ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ ని డిజైన్ చేశాడు. లోకేష్ క‌న‌గ‌రాజ్ స‌హా ప‌లువురు ద‌ర్శ‌కుల్ని విజ‌య్ లైన్ లో పెట్టేశాడు. వారితో ఒక సినిమా త‌ర్వాత ఒక‌టిగా కంటిన్యూ చేస్తూనే ఉన్నాడు. మ‌ధ్య‌లో వెకేష‌న్లు అంటూ కూడా టైమ్ తీసుకుంటున్న‌ట్టే క‌నిపించ‌డం లేదు.

ఒక ర‌కంగా మ‌న స్టార్ల‌తో పోలిస్తే విజ‌య్ అలుపెర‌గ‌ని యోధుడేన‌ని అంగీక‌రించాల్సిందే. మ‌న‌కు మాత్రం ఎవ‌రైనా పెద్ద హీరో ఓ సినిమా అంగీక‌రించాలంటేనే ఏళ్ల‌కు ఏళ్లు ప‌డుతోంద‌న్న‌ది ఇటీవ‌ల అనుభ‌వ పూర్వ‌కంగా చూశాం. బ‌న్ని - మ‌హేష్ లాంటి స్టార్లు ఓ ప‌ట్టాన ద‌ర్శ‌కులు వినిపించే క‌థ‌ల్ని ఓకే చేసేందుకే ఏళ్ల‌కు ఏళ్లు తీసుకుంటున్నారు. ఇక కొన్ని అయితే ఏడాది వెయిటింగ్ చేశాక వృధా గా ఆపేయాల్సొస్తోంది. దీనివ‌ల్ల కెరీర్ లో సినిమాల సంఖ్యా త‌గ్గిపోతోంది. క్వాలిటీ కోస‌మే అనాలో లేక ఆల‌స్యం అనాలో కానీ మ‌న స్టార్లు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేది క‌ష్ట‌మైపోయింద‌నే చెప్పాలి. ఏడాదికి ఒక సినిమాని రిలీజ్ చేయ‌డ‌మే క‌ష్టం అన్నంత‌గా ఉంది ఇక్క‌డ స‌న్నివేశం. మ‌రి పొరుగు స్టార్ల దూకుడు చూసి అయినా మ‌న‌వాళ్లు మార‌తారేమో చూడాలి. మ‌న పెద్ద హీరోలు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయ‌క‌పోవ‌డం వ‌ల్ల ప‌రిశ్ర‌మ‌లో ఉపాధి త‌గ్గిపోతోంద‌ని ఇంత‌కుముందు డా.దాస‌రి తీవ్రంగా విమ‌ర్శించేవారు. మ‌రి ఇటీవ‌ల దూకుడు పెంచిన‌ట్టే పెంచి మ‌ళ్లీ తిరిగి పాత ప‌ద్ధ‌తిలోకి వెళ్లిపోతున్నారు. మ‌రి ఇకనైనా మార‌తారేమో చూడాలి.