Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ 'ఏకే' రీమేక్ షూటింగ్ షురూ..!

By:  Tupaki Desk   |   26 Jan 2021 11:49 AM IST
పవర్ స్టార్ ఏకే రీమేక్ షూటింగ్ షురూ..!
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - దగ్గుబాటి రానా కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇది మలయాళ సూపర్ హిట్ మూవీ 'అయ్యప్పనుమ్ కోషియమ్' కి తెలుగు రీమేక్ గా తెరకెక్కుతోంది. 'అప్పట్లో ఒకడుండేవాడు' ఫేమ్ సాగర్ కె.చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌ లో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే మరియు మాటలు అందించడంతో పాటు పర్యవేక్షణ బాధ్యతలు కూడా చూసుకుంటున్నారు. సితార బ్యానర్ లో ప్రొడక్షన్ నెం.12 గా వస్తున్న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమైంది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ మేకర్స్ ఓ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో షూటింగ్ కోసం జరుగుతున్న సన్నాహాలను చూపిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెట్స్ లో అడుగుపెట్టడం చూపించారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. పవన్ బైక్ పై ఓ లాడ్జిలోకి ఎంటర్ అయ్యే సీన్స్ ని షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో పవన్ నిజాయితీ గల పవర్ ఫుల్ పోలీస్‌ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. మలయాళ రీమేక్ అయినప్పటికీ త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్లుగా స్క్రిప్ట్ లో తగినన్ని మార్పులు చేర్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి ప్రసాద్ మూరెళ్ళ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరిస్తున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.