Begin typing your search above and press return to search.
పవర్ స్టార్ 4 సినిమాలు 4 డిఫరెంట్ స్టోరీ లైన్స్...!
By: Tupaki Desk | 5 Sept 2020 11:45 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ లైన్లో పెడుతున్న సంగతి తెలిసిందే. కెరీర్ స్టార్టింగ్ నుంచి స్లో అండ్ స్టడీగా సినిమాలు తీస్తూ ఇప్పటి వరకు 25 చిత్రాలు కంప్లీట్ చేశారు. అయితే ఇప్పుడు మాత్రం స్పీడ్ పెంచి వరుసగా నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు పవన్. అందులోనూ ఆ నాలుగు సినిమాలు ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా డిఫరెంట్ స్టోరీ లైన్ తో తెరకెక్కనున్నాయని తెలుస్తోంది. పవన్ ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో 'వకీల్ సాబ్' సినిమాలో నటిస్తున్నాడు. హిందీలో అమితాబ్ బచ్చన్ నటించిన హిట్ మూవీ ‘పింక్’ రీమేక్ గా వస్తున్న ఈ చిత్రాన్ని బోనీకపూర్ సమర్పణలో దిల్ రాజు - శిరీష్ - హర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అన్యాయంగా కేసులో ఇరుక్కున్న అమ్మాయిలను రక్షించే లాయర్ పాత్రలో పవన్ కనిపిస్తారు. ఆల్రెడీ హిందీ తమిళ్ సినిమాల్లో వచ్చిన సినిమానే కాబట్టి ఈ స్టోరీ లైన్ అందరికి తెలుసు. కాకపోతే తెలుగులో పవన్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని పలు చేంజెస్ చేసారని తెలుస్తోంది.
'వకీల్ సాబ్' తర్వాత క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఓ పీరియాడికల్ మూవీలో నటించనున్నాడు. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమా నేపథ్యం రాబిన్ హుడ్ పాత్రకి ప్రేరణగా తీసుకొని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన PSPK27 ప్రీ లుక్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంది. ఇక పవన్ కెరీర్లో 28వ చిత్రాన్ని హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ పోస్టర్ పవన్ కళ్యాణ్ బర్త్ సందర్భంగా విడుదలైంది. ఈ సినిమా ఓ చదువురాని గల్లీ లీడర్ ఢిల్లీకి లీడర్ గా ఎలా మారాడనే కథాంశంతో తెరకెక్కబోతుందని సమాచారం. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు. రామ్ తాళ్లూరి నిర్మించనున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందిస్తున్నారు. ఈ సినిమా సురేందర్ రెడ్డి - వక్కంతం వంశీ కాంబోలో వచ్చిన 'కిక్' మరియు 'రేసుగుర్రం' ఫార్మాట్ లో కామెడీ ఎంటర్టైనర్ గా రాబోతోందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఎంచుకున్న స్టోరీ లైన్లు బాగానే ఉన్నాయి కానీ ఎలా తెరకెక్కిస్తారో చూడాలి.