Begin typing your search above and press return to search.
క్రైమ్ థ్రిల్లర్ గా వస్తున్న రాజ్ తరుణ్ 'పవర్ ప్లే'
By: Tupaki Desk | 4 Feb 2021 11:51 AM IST'ఒరేయ్ బుజ్జిగా' సినిమా సక్సెస్ తో జోష్ లో ఉన్న యంగ్ హీరో రాజ్ తరుణ్ - డైరెక్టర్ కొండా విజయ్ కుమార్.. ఇప్పుడు 'పవర్ ప్లే' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. శ్రీమతి పద్మ సమర్పణలో వనమాలి క్రియేషన్స్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని మహిదర్ - దేవేష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ మూవీ ఫస్ట్ లుక్ మరియు మోషన్ పోస్టర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'పవర్ ప్లే' ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ట్రైలర్ చూస్తుంటే ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఎటువంటి డైలాగ్స్ లేకుండా కేవలం బ్యాగ్రౌండ్ స్కోర్ తోనే ఈ ట్రైలర్ ని కట్ చేశారు. ఇది రాజ్ తరుణ్ - కొండా విజయ్ కుమార్ ఇద్దరికీ కొత్త జోనర్ సినిమా అని చెప్పవచ్చు. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం.. ఐ. ఆండ్రీ సినిమాటోగ్రఫీ అదనపు ఆకర్షణగా నిలిచాయి. ఈ చిత్రంలో హేమాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. పూర్ణ కీలక పాత్ర పోషించింది. ఇందులో అజయ్ - కోట శ్రీనివాసరావు - మధు - పూజా రామచంద్రన్ - ధనరాజ్ - వేణు తదితరులు నటించారు. ఈ చిత్రానికి నంద్యాల రవి స్టోరీ - డైలాగ్స్ అందిస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిఫరెంట్ జానర్ తో వస్తున్న విజయ్ కుమార్ కొండ - రాజ్ తరుణ్ లకు 'పవర్ ప్లే' ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.