Begin typing your search above and press return to search.
సినిమా టికెట్ ధరల అంశం పై విచారణ వాయిదా..!
By: Tupaki Desk | 3 Jan 2022 5:00 PM ISTఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల వ్యవహారం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. టికెట్ రేట్లు తగ్గిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 35ను హైకోర్టు రద్దు చేయగా.. సింగిల్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ లో అప్పీల్ చేసింది. దీనిపై ఈరోజు సోమవారం న్యాయస్థానంలో విచారణ జరుగగా.. ఏపీ హైకోర్టు తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.
ఏపీ ప్రభుత్వం సినిమా టికెట్ ధరల అంశంపై సమగ్రంగా పరిశీలన జరపాలని ఇటీవల ఓ కమిటీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే దానికి సంబంధించి సినీ పరిశ్రమతో త్వరలోనే కమిటీ భేటీ కానుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వం ఈరోజు సోమవారం కోర్టుకు తెలిపింది. అంతేకాదు ఈ సమావేశం ఉన్న కారణంగా విచారణ వాయిదా వేయాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ నేపథ్యంలో సినిమా టికెట్ రేట్ల పిటిషన్ విచారణను వచ్చే నెల 10కి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకుంది.
కాగా, పేదలకు సినీ వినోదం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టికెట్స్ నియంత్రించినట్లు ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు ఏపీ సర్కారు నిర్ణయం సరైంది కాదని సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమా టికెట్ రేట్ల అంశాన్ని పరిశీలించడానికి రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27న ఓ కమిటీని ప్రతిపాదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
ఏపీ ప్రభుత్వం నియమించిన కమిటీలో మొత్తం 13 మంది సభ్యులు ఉండగా.. అందులో అధికారులతో పాటుగా సినీ ఇండస్ట్రీ వ్యక్తులను భాగం చేసారు. హోం శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో న్యాయశాఖ కార్యదర్శి - కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు పురపాలక శాఖ - ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శులు - సమాచార, పౌర సంబంధాల కమీషనర్ సభ్యులుగా ఉన్నారు.
అలానే ఎగ్జిబిటర్ వేమూరి బాలరత్నం - డిస్ట్రిబ్యూటర్ తుమ్మల సీతారాం ప్రసాద్ - సినీ గోయర్స్ అసోసియేషన్ తరఫున సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, సిబిఎఫ్సి సెన్సార్ బోర్డ్ సభ్యుడు వడ్డి ఓం ప్రకాశ్ నారాయణ - తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఉపాధ్యక్షులు ముత్యాల రాందాస్ - డాక్టర్ జూపల్లి రాకేశ్ రెడ్డి - గంప లక్ష్మీ ప్రభుత్వం నియమించిన కమిటీలో సభ్యులుగా నియమితులయ్యారు.
సినిమా టికెట్ ధరల మీద పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో చిన్న - పెద్ద సినిమాలకు ఇబ్బందులు తలెత్తకుండా రేట్లు పెట్టాలని కమిటీ సూచించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా టికెట్ ధరల వ్యవహారం మరియు డిస్ట్రిబ్యూటర్స్ - ఎగ్జిబిటర్స్ సమస్యలపై ఈ కమిటీ కూలంకషంగా చర్చించి ఏపీ ప్రభుత్వానికి నివేదిక అందజేస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వం దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది.