Begin typing your search above and press return to search.

ఆ పోస్టర్లు వర్కవుట్ కాలే

By:  Tupaki Desk   |   7 Jun 2017 5:13 PM GMT
ఆ పోస్టర్లు వర్కవుట్ కాలే
X
సినిమా పోస్టర్స్ విషయంలో మేకర్స్ ఎంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేందుకు గత వారం రిలీజ్ అయిన మూవీస్ ను బెస్ట్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. బాహుబలి మూవీకి పోస్టర్స్ ఇచ్చినపుడు ప్రతీ పోస్టర్ హైలైట్ అయింది. ప్రభాస్- అనుష్కలు ఒకే విల్లు సంధించడం.. ప్రభాస్ తన ఛాతీపై విబూధి చల్లుకోవడం లాంటివి మంచి సక్సెస్ అయ్యాయి. సినిమాలో ఆయా సీన్లకు జనాలతో కేకలు పెట్టించే పరిస్థితి కనిపిస్తుంది.

కానీ గతవారం విడుదల అయిన అంధగాడు.. ఫ్యాషన్ డిజైనర్లకు సంబంధించి పోస్టర్లతో పబ్లిసిటీ ట్రిక్స్ ప్రయోగించారు మేకర్స్. రీసెంట్ టైంలో ఓ పోస్టర్ గురించి ఎక్కువగా జనాలు మాట్లాడుకున్నారంటే అది ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో నటించిన సుమంత్ అశ్విన్.. హీరోయిన్ అనీష్ ఆంబ్రోస్ చెస్ట్ కొలతలు టేప్ తో తీసుకున్న పోస్టర్ గురించే. అయితే.. సినిమాలో ఈ సీన్ ఎక్కడా ఉండదు. అసలు హీరో తన కళ్లతోనే హీరోయిన్ల కొలతలు పట్టేస్తాడు. మూవీలో హీరో కేరక్టరైజేషన్ కి కీలకం ఇదే. మరి ఈ టేప్ తో కొలతలు తీసే ఫోటో ఎక్కడిది అంటే.. పబ్లిసిటీ కోసం చేసిన హంగామా మాత్రమే.

ఇక రాజ్ తరుణ్ మూవీ అంధగాడుది కూడా సేమ్ సిట్యుయేషన్. హీరో హీరోయిన్ల ఇద్దరి చేతులు పట్టుకుని రాజేంద్రప్రసాద్ దగ్గరకు లాగుతున్నట్లుగా ఓ పోస్టర్ పడింది. కానీ మూవీలో దెయ్యం పాత్ర పోషించిన రాజేంద్ర ప్రసాద్.. వేరే ఎవరితోనూ ఇంటరాక్ట్ కాడు. పోస్టర్లలో ఓ కంటెంట్ చూపించి.. సినిమాలో ఆయా సీన్స్ లేకపోతే పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పడానికి.. అంధగాడు- ఫ్యాషన్ డిజైనర్ మూవీస్ కి ఎదురైన రిజల్ట్ ను ఎగ్జాంపుల్ గా చూపచ్చు. జనాలు బాగా హుషారుగా ఉంటున్నారు మేకర్స్.. జర ఎలర్ట్ గా ఉండాలె!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/