Begin typing your search above and press return to search.

చైతుకిదే మంచి ఛాన్స్!!

By:  Tupaki Desk   |   19 Oct 2018 6:14 AM GMT
చైతుకిదే మంచి ఛాన్స్!!
X
అక్కినేని వారసుడు నాగ చైతన్యతో పాటు అతని అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం సవ్యసాచి. సీజే వర్క్ వల్ల విడుదల కొంత ఆలస్యం అయినా కాన్సెప్ట్ కొత్తగా ఉండటంతో ప్రేక్షకుల్లో దీని మీద మంచి ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల క్రితమే టీజర్ తో ప్రమోషన్ మొదలుపెట్టిన టీమ్ దసరా నుంచి ఇంకాస్త వేగం పెంచే పనిలో పడ్డారు. విడుదల తేదీ గురించి పక్కాగా నిర్ధారణకు రాకపోయినా నవంబర్ 2న చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఏదో ఒక నిర్ణయం ఇంకో రెండు మూడు రోజుల్లో తీసుకోవచ్చు. ఆ స్లాట్ అయితేనే ఓపెనింగ్స్ పరంగా కూడా హెల్ప్ అవుతుందని యూనిట్ భావిస్తున్నట్టు సమాచారం.

బాక్స్ ఆఫీస్ వద్ద దసరా సందడి నాలుగైదు రోజుల్లో ముగిసిపోతుంది. నిన్న వచ్చిన హలో గురు ప్రేమ కోసమే-పందెం కోడి 2 ఏదీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోలేదు కాబట్టి ఎంతో కొంత పాజిటివ్ ఉన్నా అది మహా అయితే ఓ రెండు వారాలు ఉంటుంది. ఆ తర్వాత కొత్త సినిమాలు ఏవి వస్తాయా అనే ప్రేక్షకులు ఎదురు చూస్తుంటాడు. సవ్యసాచి కనక ఆ డేట్ తీసుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. చందు మొండేటి దర్శకత్వం వహించిన సవ్యసాచిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. చాలా ఏళ్ళ తర్వాత మాధవన్ తెలుగు స్ట్రెయిట్ మూవీ చేయడం విశేషమైతే ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్ప ఒప్పుకొని ఆయన ఏకంగా నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రకు సిద్ధపడటం. నిధి అగర్వాల్ హీరోయిన్ గా పరిచయమవుతున్న ఈ మూవీ కీరవాణి సంగీతం అందించడం మరో ఆకర్షణ. ఇప్పటికే విడుదలైన ట్రాక్స్ మ్యూజిక్ లవర్స్ నుంచి మంచి స్పందన దక్కించుకున్నాయి.

చైతు సోదరిగా భూముక మరో కీలక పాత్ర పోషించిన సవ్యసాచి రాక కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. నవంబర్ మొదటివారంలో పెద్దగా పోటీ లేదు కాబట్టి ఆరకంగా ఓపెనింగ్స్ కూడా ప్లస్ అవుతుంది. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మైత్రి సంస్థ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ట్రేడ్ నుంచి బిజినెస్ సపోర్ట్ బాగుంది. కార్తికేయ లాంటి థ్రిల్లర్ ను హ్యాండిల్ చేసిన చందు మొండేటి సవ్యసాచిని అంతకు మించి అనిపించేలా తీసాడని ఇన్ సైడ్ టాక్ ఇప్పటికే ఉంది. మరి ఈ ఏడాది తొలి సక్సెస్ బోణి చైతుకి సవ్యసాచే అయ్యేలా ఉంది