Begin typing your search above and press return to search.

విరూపాక్ష అక్కడ ఫస్ట్ టెస్ట్ పాస్

By:  Tupaki Desk   |   5 May 2023 3:04 PM IST
విరూపాక్ష అక్కడ ఫస్ట్ టెస్ట్ పాస్
X
సాయి ధరమ్ తేజ్ హీరోగా కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన విరూపాక్ష మూవీ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకొని రికార్డ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఇప్పటికి డీసెంట్ కలెక్షన్స్ తో ఈ మూవీ థియేటర్స్ లో కొనసాగుతూ ఉండటం విశేషం. ఈ మధ్యకాలంలో వచ్చిన బెస్ట్ థ్రిల్లింగ్ మూవీ అనే ఫేమ్ విరూపాక్షకి వస్తోంది. తేజ్ కెరియర్ లోనే బెస్ట్ మూవీగా ఈ చిత్రం నిలిచింది.

ఇదిలా ఉంటే ఇపటికే 40 కోట్ల షేర్ ని క్రాస్ చేసిన ఈ చిత్రం 50 కోట్ల షేర్ క్లబ్ కి చేరువ అవుతోంది. తెలుగు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ అందుకోవడంతో ఇప్పుడు ఇతర భాషలలో కూడా సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేశారు. ముందుగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే రిలీజ్ చేయాలని అనుకున్నారు.

అయితే ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా తెలుగులో రిలీజ్ చేసి సక్సెస్ అందుకోవడంతో ఇప్పుడు ఇతర భాషలకి వెళ్తున్నారు. తమిళ్, మలయాళం, హిందీ భాషలలో విరూపాక్ష అదే టైటిల్ తో నేడు రిలీజ్ కాబోతోంది. గత వారం రోజుల నుంచి ఈ మూవీ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే తమిళ్ లో మీడియాకి ప్రత్యేకంగా స్పెషల్ షో వేశారు.

ఇక మూవీని చూసిన క్రిటిక్స్, మీడియా ప్రతినిధుల నుంచి పాజిటివ్ టాక్ ని అందుకున్నారు. ఓవరాల్ రిపోర్ట్ కూడా సూపర్ గా ఉందనే అభిప్రాయం వచ్చింది. స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా పాజిటివ్ టాక్ ని తమిళ్ లో సొంతం చేసుకోవడంతో ఈ రోజు రివ్యూలు కూడా పాజిటివ్ గా వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. ఇలా కోలీవుడ్ లో ఫస్ట్ టెస్ట్ ని విరూపాక్ష పాస్ అయ్యి ప్రేక్షకుల రెస్పాన్స్ కోసం వెయిట్ చేస్తోంది.

ఇక హిందీలో కూడా కార్తికేయ 2, కాంతారా తరహాలో స్లో ఫేజ్ లో ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రకమైన థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో ఈ మధ్యకాలంలో సినిమాలు రాకపోవడంతో కచ్చితంగా ఇతర భాషలలో కూడా మూవీ సక్సెస్ అవుతుందని నమ్మకంగా ఉన్నారు. నార్త్ ఇండియన్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే మాత్రం కాంతారా, సీతారామం, కార్తికేయ 2 తరహాలో పెద్ద హిట్ చేస్తారని చెప్పొచ్చు.