Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు?

By:  Tupaki Desk   |   5 Dec 2016 10:42 AM IST
పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ ఎలా అయ్యాడు?
X
పవన్ కళ్యాణ్ పేరెత్తగానే ఆ పేరుకు ముందు పవర్ స్టార్ వచ్చి యాడ్ అయిపోతుంది. చిరంజీవి మెగాస్టార్ గా ఎంత ఫేమస్సో.. పవన్ కూడా పవర్ స్టార్ గా అంతే ఫేమస్. పవన్ ఎనర్జీకి ‘పవర్ స్టార్’ బిరుదు పర్ఫెక్టుగా సూటయింది. మరి ఈ బిరుదు పవన్ కు ఇచ్చిందెవరు? ఎప్పట్నుంచి పవన్ కళ్యాణ్ ను అభిమానులు పవర్ స్టార్ అని పిలుస్తున్నారన్న ప్రశ్నలకు పోసాని కృష్ణమురళి సమాధానం ఇచ్చాడు. పవన్ కు ‘పవర్ స్టార్’ బిరుదు ఇచ్చింది తానే అని ఆయన ‘ధృవ’ ప్రి రిలీజ్ ఫంక్షన్లో వెల్లడించాడు. ఈ వేడుకలో అభిమానులు పవర్ స్టార్ నినాదాలతో హోరెత్తిస్తుండగా పోసాని ఈ విషయం వెల్లడించాడు.

సీనియర్ డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్యకు పోసాని ఆస్థాన రచయిత అన్న సంగతి తెలిసిందే. సుబ్బయ్య దర్శకత్వంలో పవన్ ‘గోకులంలో సీత’ సినిమా చేశాడు. ఆ సినిమా సందర్భంగానే తాను పవన్ కళ్యాణ్ కు పవర్ స్టార్ అనే బిరుదు ఇచ్చానని.. పవన్ నిజంగానే ఆ బిరుదుకు సార్థకం చేసుకున్నాడని పోసాని అనడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేవు. ఈ వేడుకలో మెగా హీరోలు రామ్ చరణ్.. అల్లు అర్జున్ ల మీదా ప్రశంసలు కురిపించాడు పోసాని. మెగాస్టార్ చిరంజీవి కొడుకైనప్పటికీ చరణ్ ఎంతో కష్టపడతాడని.. అతడి కష్టం అసామాన్యమైందని పోసాని అన్నాడు. బన్నీ టాలీవుడ్లో నెంబర్ వన్ డ్యాన్సర్ అని పోసాని కితాబిచ్చాడు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/